SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » How Krishnam Raju Treats Prabhas

Krishnam Raju: తమ్ముడి కొడుకులా కాదు.. కన్న కొడుకులా! ప్రభాస్ అంటే కృష్ణంరాజుకి అంత ఇష్టం!

  • Written By: Nagarjuna
  • Published Date - Sun - 11 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Krishnam Raju: తమ్ముడి కొడుకులా కాదు.. కన్న కొడుకులా! ప్రభాస్ అంటే కృష్ణంరాజుకి అంత ఇష్టం!

రెబల్ స్టార్ కృష్ణంరాజు(జనవరి 20 1940 – 11 సెప్టెంబర్ 2022) ఇవాళ తెల్లవారు జామున 3 గంటల 25 నిమిషాలకి ఏఐజీ ఆసుపత్రిలో కన్ను మూసిన సంగతి తెలిసిందే. పోస్ట్ కోవిడ్ తర్వాత వచ్చే అనారోగ్య సమస్యల కారణంగా ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. రెండు సార్లు కరోనా బారిన పడ్డ కృష్ణంరాజు.. ఆగస్ట్ 5న కోవిడ్ తర్వాత వచ్చే సమస్యలతో ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆయనను నెల రోజులుగా వెంటిలేటర్ ఉంచి చికిత్స అందజేశామని వైద్యులు తెలిపారు. మూత్రపిండాల పనితీరు పూర్తిగా దెబ్బ తినడం, డయాబెటిస్, కార్డియాక్ అరెస్ట్ వంటి కారణాలతో కృష్ణంరాజు మృతి చెందినట్లు ఏఐజీ ఆసుపత్రి డాక్టర్లు వెల్లడించారు.

కృష్ణంరాజు మృతి పట్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ పెద నాన్నని చూసి కన్నీరు మున్నీరవుతున్నారు. అంతలా ప్రభాస్ ఏడవడానికి కారణం కృష్ణంరాజు ప్రభాస్ కి తండ్రి లేని లోటుని తీర్చడమే. ప్రభాస్ తండ్రి సూర్యనారాయణ రాజు చనిపోయినప్పుడు ఎంతలా విలవిలలాడిపోయారో.. ఇప్పుడు కృష్ణంరాజు చనిపోయినప్పుడు కూడా అంతకంటే ఎక్కువగా కంటతడి పెడుతున్నారు. ప్రతీ ఇంట్లోనూ పెదనాన్న/చిన్నాన్న, సోదరుడు కొడుకుల మధ్య చాలా సాన్నిహత్యం ఉంటుంది. తండ్రికి చెప్పుకోలేని విషయాలు కూడా తండ్రి సోదరుడితో షేర్ చేసుకుంటారు. ప్రభాస్, కృష్ణంరాజులా బాండింగ్ ని చూసే బలాదూర్ సినిమా తీశారేమో అనిపిస్తుంది. సినిమాల్లోకి రాకముందు ప్రభాస్ కూడా బలాదూర్. సత్ప్రవర్తన కలిగిన బలాదూర్ మనిషి. ఫ్రెండ్స్ తో తిరగడం, షికార్లు ఇలా ఉండేది.

 

View this post on Instagram

 

A post shared by U.V.Krishnam Raju (@uvkrishnamraju)

అలాంటి ప్రభాస్ ని సినిమాల్లోకి తీసుకొచ్చింది, హీరోని చేసింది, ఇవాళ అంతర్జాతీయ హీరోగా నిలబెట్టింది రెబల్ స్టార్ కృష్ణంరాజే. కృష్ణంరాజుకి ముగ్గురూ కూతుర్లే అవ్వడం వల్ల.. తన తర్వాత తన కుటుంబం నుంచి ఒకరు హీరోగా రావాలని అనుకున్నారు. ఉప్పలవాటి వారి నట ప్రస్థానం తనతో ఆగిపోకూడదని పట్టుబట్టి మరీ ప్రభాస్ ని సినిమాల్లోకి తీసుకొచ్చారు. నిజానికి ప్రభాస్ కి సినిమాల్లోకి రావాలన్న ఆసక్తి లేదు. పైగా ప్రభాస్ కి సిగ్గు ఎక్కువ. కెమెరాని ఫేస్ చేయాలంటే మొహమాటం. అలాంటి ప్రభాస్ ని బలవంతంగా కెమెరా ముందు నిలబెట్టి.. తన నట వారసత్వాన్ని, రెబల్ స్టార్ అనే బిరుదుని ఇచ్చి డార్లింగ్ ని మన ముందు నిలబెట్టారు. కృష్ణంరాజుకి కొడుకు ఉన్నా కూడా ప్రభాస్ ని ఇదే విధంగా చూసేవారని ప్రభాస్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.

సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు వెన్నుతట్టి ప్రోత్సహించారు. ఎంత ఎత్తుకి ఎదిగినా ఒదిగి ఉండడం అనే గొప్ప లక్షణం ప్రభాస్ కి కృష్ణంరాజు నుండి వచ్చిందే. ఆ లక్షణమే ఇవాళ ప్రభాస్ వెండితెర రారాజుగా, మనసున్న మారాజుగా మన ముందు నిలబెట్టింది. ఇదంతా కృష్ణంరాజు ట్రైనింగే. తన సొంత కొడుకులా ప్రభాస్ ని తీర్చిదిద్దారు. ప్రభాస్ ని తమ్ముడి కొడుకుగా కంటే కూడా కన్న కొడుకుగానే చూసుకున్నారు. అసలు పెదనాన్న అనే ప్రస్తావనే లేకుండా, నాన్నే అన్న భావన కలిగించారు. నాన్న లాంటోడు ఏంటి, నాన్నే అనే భావన ప్రభాస్ కి కలిగించారు. ఇద్దరి మధ్య తండ్రీ, కొడుకుల అనుబంధం ఉందని చెప్పడానికి ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి.

 

View this post on Instagram

 

A post shared by U.V.Krishnam Raju (@uvkrishnamraju)

కృష్ణంరాజుకి ప్రభాస్ అంటే ఎంత ఇష్టమో, ప్రభాస్ కి కూడా కృష్ణంరాజు అన్నా కూడా అంతే ఇష్టం. ఇష్టం కంటే ఎక్కువ ప్రాణం. ప్రభాస్ కి తండ్రి లేని లోటుని కృష్ణం రాజు భర్తీ చేశారు. కానీ కృష్ణం రాజు లేని లోటుని మాత్రం ఎవరూ భర్తీ చేయలేరు. మిమ్మల్ని కోల్పోయాం కృష్ణంరాజు గారు. మీకు సద్గతులు ప్రాప్తించాలని ఆ భగవంతుడ్ని కోరుకుంటున్నాం. ఓం శాంతి!. కృష్ణంరాజు, ప్రభాస్ ల బాండింగ్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. 

  • ఇది చదవండి: Krishnam Raju: కృష్ణంరాజుకి రెబల్ స్టార్ అనే బిరుదు ఎలా వచ్చిందంటే?
  • ఇది చదవండి: Prabhas: నిన్నే ఆసుపత్రిలో కృష్ణంరాజుని పరామర్శించిన ప్రభాస్! అంతలో ఏమి జరిగింది?

Tags :

  • Krishnam Raju
  • Movie News
  • Prabhas
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • 20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

    20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

  • హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

    హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam