హీరో సూర్యకు మద్రాస్ హైకోర్టులో చుక్కెదురైంది. దాదాపు రూ.3 కోట్లు చెల్లించాలని ఆదాయ పన్ను శాఖ ఆదేశించడాన్ని వ్యతిరేకిస్తూ సూర్య వేసిన పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. సూర్య తన ఆదాయానికి తగ్గట్టు పన్నులు చెల్లించం లేదనే కారణంతో 2010లో ఆదాయ పన్ను శాఖ అధికారులు ఏక కాలంలో ఆయనకు సంబంధించిన ఇళ్లు, వ్యాపార స్థలాల్లో సోదాలు నిర్వహించారు. ఆయన దాదాపు రూ.3కోట్లు వరకు ట్యాక్స్ చెల్లించాలని ఆదాయ పన్ను శాఖ ఆదేశించింది. దీంతో సూర్య వారి ఆదేశాన్ని వ్యతిరేకిస్తూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. సూర్యకు మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆయన వేసిన పిటిషన్ను హైకోర్ట్ తోసిపుచ్చింది.
సూర్య తన ఆదయానికి తగ్గట్లు పన్ను చెల్లింపులు జరపడం లేదంటూ 2010లో ఆదాయ పన్ను శాఖ అధికారులు ఆయన ఇళ్లు, ఆఫీసులో ఒకేసారి సోదాలు చేశారు. సోదాల్లో లెక్కల్లో లేని పలు ఆదాయాలకు సంబంధించి మొత్తం రూ.3.11 కోట్ల పన్ను చెల్లించాలని నోటీసులు జారీ చేశారు. దీంతో అధికారులు జారీ చేసిన నోటీసులో వడ్డీ మినహా కోరుతూ సూర్య మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. సెలబ్రిటీ స్థాయిలో ఉన్నవారు మిగతా వారికి ఆదర్శంగా నిలబడాలని., ఆదాయపు పన్ను శాఖ జారీ చేసిన మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించాల్సిందేనంటూ తీర్పునిచ్చింది మద్రాస్ హైకోర్టు.
గతంలో విజయ్ , ధనుష్ దిగుమతి చేసుకున్న లగ్జరీ కారును కలిగి ఉన్నందుకు పన్ను మినహాయింపు కోసం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు, అయితే వారికి పన్ను నుండి మినహాయింపులు నిరాకరించబడ్డాయి. ఇప్పుడు సూర్య కూడా అదేబాటలో మొట్టికాయలు తిన్నాడు.