బాడీ షేమింగ్ అనేది కేవలం మాట కాదు, ఎదుటి వ్యక్తిని కుంగిపోయేలా చేసే ఒక విషపూరిత ఆయుధం. సన్నగా ఉన్నావనో, లావుగా ఉన్నావనో, ఎత్తు పళ్ళు అనో, డొప్ప చెవులనో రకరకాలుగా లోపాలు అన్నట్టు ఎత్తి చూపుతారు. సన్నగా ఉంటే బతకలేమన్నట్టు, లావుగా ఉంటే లోపం అన్నట్టు అందరి ముందు హేళన చేస్తారు. తాము ఇలా ఉంటే లోపం అనుకుని కుంగిపోయేలా విమర్శల దాడి చేస్తారు. అయితే కొంతమంది మాత్రం ధైర్యంగా విమర్శలను తిప్పి కొడతారు. ఎన్ని కామెంట్స్ చేసినా లెక్క చేయకుండా తమ పని తాము చేసుకుని పోతారు. బాడీ షేమింగ్ అనేది కేవలం కొన్ని రంగాల్లోనే కాదు, ప్రతీ రంగంలోనూ ఉంది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఇది మరీ దారుణంగా ఉంటుంది. బాడీ షేమింగ్ ని ఎదుర్కున్న వాళ్లలో అనేకమంది హీరోయిన్లు ఉన్నారు.
బాలీవుడ్ లో స్ట్రాంగ్ అండ్ పవర్ ఫుల్ పాత్రలు, వైవిధ్యమైన పాత్రలు చేసే విద్యాబాలన్.. అనారోగ్య సమస్యల కారణంగా లావుగానే ఉండిపోయారు. వెయిట్ లాస్ కోసం ప్రయత్నించినా అనారోగ్య సమస్య కారణంగా ఆమె బొద్దుగా ఉండిపోయింది. అయినప్పటికీ ఆమె తన ఇన్నర్ బ్యూటీతో అందరి మనసుల్ని గెలుచుకుంది. బొద్దుగా ఉన్నా కూడా ఆమెని ఇష్టపడే ప్రేక్షకులు, అభిమానులు ఎంతోమంది ఉన్నారు. కేవలం ఆమె కేరెక్టర్ అండ్ ఆమె చేసే కేరెక్టర్ వల్ల ఆమెను ఆరాధిస్తున్నారు. లావుగా ఉన్నావు, హీరోయిన్ అవ్వడం కష్టం అని ఎగతాళి చేసిన వారే ఈరోజు ఆమె హీరోయిన్ గా నిలబడి చూపించింది.
ఈమె ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో బాగా బొద్దుగా ఉండేది. మొదట్లో బాడీ షేమింగ్ ని ఎదుర్కొంది. సినిమాల కోసం బరువు తగ్గాలని ప్రయత్నం చేసే క్రమంలో ఈమె తీవ్రంగా బాడీ షేమింగ్ ను ఎదుర్కొంది. కష్టపడి బరువు తగ్గి స్లిమ్ గా తయారైంది.
ప్రియాంక చోప్రా కజిన్ సిస్టర్ అయినా గానీ బాడీ షేమింగ్ తప్పలేదు. కెరీర్ తొలినాళ్లలో బాడీ షేమింగ్ ను ఎదుర్కోవాల్సి వచ్చింది. మొదట్లో 80 కిలోల పైనే ఉండేది. ఆ తర్వాత కష్టపడి వర్కవుట్లు చేసి 60 కిలోలకు వచ్చింది.
దేవదాసు సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. అందరి మనసుల్ని దోచుకున్న గోవా బ్యూటీ ఇలియానాకి సైతం బాడీ షేమింగ్ తప్పలేదు. సన్నని నడుమున్న ఇలియానాని.. మరీ బక్కగా ఉందని, నలకలా ఉందని అనేవారు. కానీ ఆమె అవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుని వెళ్ళిపోతుంది. ఈ మధ్య కొంచెం బరువు చేసింది.
చాణక్య సినిమాలో గోపీచంద్ సరసన నటించింది. ఈమె కూడా మొదట్లో తీవ్రమైన బాడీ షేమింగ్ ను ఎదుర్కొంది. బరువు అధికంగా ఉండడం వల్ల కొందరు విమర్శించేవారు. కానీ ఈమె అవేమీ పట్టించుకోకుండా తనకి నచ్చినట్టు బతుకుతుంది.
నిత్యామీనన్ ని కూడా చాలా మంది విమర్శించారు. లావుగా ఉన్నావని, ఆఫర్లు రావడం కష్టమని, కొంచెం తగ్గమని సలహా ఇచ్చారు. కానీ నిత్యామీనన్ మాత్రం ‘నేను ఇలానే ఉంటాను. అవకాశం ఇస్తే ఇవ్వండి, లేదంటే లేదు’ అని తెగేసి చెప్పింది. అదే బొద్దు ఫిజిక్ తో ఇండస్ట్రీలో నెగ్గుకొస్తుంది. ఇప్పటికీ హీరోయిన్ గా కొనసాగుతుంది.
అలా ఈ హీరోయిన్లు అందరూ తమలో ఏ లోపం లేదు అని ఫీలయ్యారు కాబట్టే ఈ లోకంలో సక్సెస్ ఫుల్ గా లైఫ్ ని లీడ్ చేయగలుగుతున్నారు. లోపం అనేది ఎదుటివాడి దృష్టిలో ఉంటుంది తప్ప మనలో ఉండదు అని నిరూపించారు ఈ హీరోయిన్లు.