ఆమె చిన్నప్పుడు చాలా క్యూట్ గా ఉంది. పెద్దయ్యాక మాత్రం హాట్ నెస్ తో చంపేస్తోంది. ఆమె నవ్వుకి బోలెడంత మంది ఫ్యాన్స్ ఉన్నారు. అలానే ఓ విషయంలో ఆమెని తెగ ట్రోల్ చేస్తుంటారు. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో కనిపెట్టారా?
ఆమె నవ్వితే ఎవరైనా సరే ఫిదా కావాల్సిందే. నవరత్నాలు రాలిపోతాయేమో అనేంత అందంగా ఉంటుంది. చీరకట్టినా, బికినీ వేసినా గ్లామర్ లో ఆమె బీట్ చేయడం మిగతా హీరోయిన్లకు చాలా అంటే చాలా కష్టం. మరోవైపు పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె తెలుగు సినిమాలతో స్టార్ హోదా దక్కించుకుంది. గత మూడు నాలుగు చిత్రాలతో ప్లాఫ్స్ మూటగట్టుకున్న ఈ భామ.. ఓ విషయంలో మాత్రం ఎప్పుడూ ట్రోలింగ్ కు గురవుతూనే ఉంటుంది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. పైన ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి ఇప్పుడు బుట్టబొమ్మగా మనందరి మనసుల్లో స్థానం సంపాదించుకున్న పూజాహెగ్డే. చిన్నప్పుడు బూరెల్లాంటి బుగ్గలతో భలే అందంగా ఉన్న ఈ బ్యూటీ.. ఇప్పుడు కూడా అంతకంటే గ్లామరస్ గా తయారైంది. అయితే హీరోయిన్ గా పూజాహెగ్డే చాలా సూపర్ గా ఉంటుంది. కానీ పూజాహెగ్డే ఏడిస్తే మాత్రం అస్సలు బాగోదు. ఈ ఒక్క విషయంలో మాత్రమే ఆమెని అభిమానులు ట్రోల్ చేస్తుంటారు. పలు సినిమాల్లో పూజాహెగ్డే ఏడుస్తున్న విజువల్స్ పోస్ట్ చేసి మరీ విమర్శలు చేస్తుంటారు. ఇది తప్పితే ఆమె అందాల రాశిలా అద్భుతంగా ఉంటుంది.
ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తో ఓ సినిమా చేస్తున్న పూజాహెగ్డే.. తెలుగులో మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబోలో తీస్తున్న ఓ చిత్రంలోనూ నటిస్తోంది. ఈ రెండు పూజాహెగ్డేకు చాలా ఇంపార్టెంట్. ఇవి రెండు హిట్ అయితేనే ఈమె కెరీర్ మరికొంత కాలం ఉంటుంది. లేదంటే మాత్రం ఈ బ్యూటీని పట్టించుకునే నాథుడే కరువవుతాడు. ఇక తాజాగా ‘రాధేశ్యామ్’ సినిమా ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ప్రభాస్ తోపాటు పూజాహెగ్డే ట్రెండింగ్ లోకి వచ్చింది. అలానే ఈమె చిన్నప్పటి ఫొటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి చిన్నప్పటి పూజాని చూసి మీలో ఎంతమంది గుర్తుపట్టారు? కింద కామెంట్ చేయండి.