హీరోహీరోయిన్లను విపరీతంగా అభిమానించే కల్చర్ మన దగ్గర చాలా ఎక్కువ. చిన్న హీరోనా పెద్ద హీరోయిన్ అనే తేడా అసలే ఉండదు. ఓ మంచి, అందులో అద్భుతమైన యాక్టింగ్ చేస్తే.. ప్రేక్షకులు గుండెల్లో పెట్టేసుకుంటారు. గుడి కట్టినాసరే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఇక సోషల్ మీడియా ట్రెండ్ బాగా పెరిగిపోయిన ఈ కాలంలో.. సదరు హీరోయిన్లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఎప్పటికప్పుడు ఇన్ స్టాలో షేర్ చేస్తూనే ఉంటారు. అప్పుడప్పుడు సదరు యాక్టర్స్ చిన్నప్పటి ఫొటోలు కూడా బయటకొస్తుంటాయి. వాటిని చూసి అభిమానులు తెగ మురిసిపోతుంటారు. భలే ముద్దుగా ఉన్నారంటూ తెగ కామెంట్స్ పెడుతుంటారు. ఇప్పుడు కూడా అలానే ఓ స్టార్ హీరోయిన్ పిక్ వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. పైన ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి, ఇప్పుడు హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న నివేదా పేతురాజ్. ఈమె గురించి మాట్లాడుకుంటే.. మధురైలో నవంబరు 30న అంటే ఈరోజే పుట్టిన నివేతా.. 11 ఏళ్ల వయసులో ఫ్యామిలీతో సహా యూఏఈకి షిప్ట్ అయిపోయింది. అక్కడే స్టడీస్ అంతా పూర్తి చేసింది. 2015లో మిస్ ఇండియా యూఏఈగా నిలిచింది. ఆ తర్వాత ఈమెకు తమిళంలో హీరోయిన్ గా తొలి అవకాశం వచ్చింది. ‘ఒరు నాల్ కూతు’ సినిమాతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఏడాది అంటే 2017లో టాలీవుడ్ లోకి కూడా ‘మెంటల్ మదిలో’ మూవీతో హీరోయిన్ ప్రేక్షకుల్ని పలకరించింది.
ఇక తెలుగులో చిత్రలహరి, బ్రోచేవారెవరురా!, అల వైకుంఠపురములో, రెడ్, పాగల్, బ్లడ్ మేరీ, విరాటపర్వం లాంటి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న ‘దమ్కీ’లో హీరోయిన్ గా చేస్తోంది. ఇటీవల ఆ సినిమా ట్రైలర్ రిలీజ్ కాగా.. ప్రేక్షకుల నుంచి డిఫరెంట్ కామెంట్స్ వినిపించాయి. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నివేతా.. ఎప్పటికప్పుడు ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూనే ఉంటుంది. సినిమాల్లో, బయట ఎప్పుడు సంప్రదాయ డ్రస్సులు వేసుకుని ఉంటుంది. అప్పుడప్పుడు మాత్రం మోడ్రన్ ఔట్ ఫిట్ లో కిరాక్ పోజులిస్తూ ఉంటుంది. కాకపోతే అవి చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. మరి నివేతా యాక్టింగ్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.