హీరోయిన్ నిత్యామేనన్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. నేచులర్ బ్యూటీతో పాటు కర్లింగ్ హెయిన్ ఈమెకు చాలామంది అభిమానులని తెచ్చిపెట్టాయి. ఇక తెలుగుతోపాటు తమిళం, మలయాళంలో ఈమె చాలా ఫేమస్. అలాంటి ఈమె సడన్ గా ఇన్ స్టాలో తల్లయినట్లు పోస్ట్ పెట్టింది. అది కూడా పెళ్లి కాకుండానే. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్. ప్రస్తుతం అందుకు సంబంధించిన విషయం వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. సాధారణంగా హీరో లేదా హీరోయిన్ పెళ్లి చేసుకున్నా, ప్రెగ్నెన్సీ వచ్చినా దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభిమానులకు చెబుతుంటారు. ఇప్పుడు నిత్యామేనన్ కూడా అలానే ప్రెగ్నెన్సీ కిట్ ఫొటో పోస్ట్ చేసింది. ‘అద్భుతం మొదలైంది’ అనే క్యాప్షన్ పెట్టింది. దీంతో చాలామంది నెటిజన్స్.. తండ్రి ఎవరా అని ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగా తమకు తోచిన పేర్లు కామెంట్స్ లో పోస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే గతంలో నిత్యామేనన్ కు ఆ హీరోతో పెళ్లి, ఈ హీరో డేటింగ్ అనే వార్తలొచ్చిన నేపథ్యంలో.. ప్రెగ్నెన్సీ ఫొటో వైరల్ గా మారింది.
మరికొందరు నెటిజన్స్ మాత్రం నిత్యామేనన్ ప్రెగ్నెన్సీ ఫొటో సినిమా ప్రమోషన్ కోసమేనని తేల్చేశారు. ఎందుకంటే నిత్యామేనన్ పోస్ట్ చేసిన ఫొటోనే మలయాళ హీరోయిన్ పార్వతి కూడా పోస్ట్ చేసింది. దీంతో ఇది పక్కా సినిమా లేదంటే వెబ్ సిరీస్ కోసమే అని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా ‘హనుమాన్’ మూవీతో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన నిత్యా.. ప్రస్తుతం దక్షిణాదితోపాటు హిందీలోనూ వెబ్ సిరీసులు చేస్తూ ఫుల్ బిజీగా మారింది. రీసెంట్ గా ఆహాలోనూ ఓ సింగింగ్ షోకి జడ్జిగా చేసి ఆకట్టుకుంది. ఇదంతా పక్కనబెడితే.. నిత్యామేనన్ ప్రెగ్నెన్సీ పోస్టుపై క్లారిటీ రావాల్సి ఉంది.