ఆమెని చూస్తే సింపుల్ గా ఉంటుంది. అందానికి ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోవడం గ్యారంటీ! ఎందుకంటే అంత అందంగా ఉంటుంది కాబట్టి. చీరకట్టినా, మోడ్రన్ డ్రస్ వేసినా ఆమె అందం ఏమాత్రం తగ్గదు. ఇక కుర్రాళ్లయితే… ‘నిజంగానే నిన్ను గుర్తుపట్టలేకపోయాను రాధిక?’ అని పంచ్ డైలాగ్ కూడా వేస్తారు. అంతలా పాపులర్ అయింది మరి. ప్రస్తుతం టాలీవుడ్ పై మాత్రమే కాన్సట్రేట్ చేసిన ఈ భామ.. స్టార్ హీరోలతో కలిసి నటించాలని తెగ ఆరాటపడుతోంది. మరి ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. పైన ఫొటోలు కనిపిస్తున్న చిన్నారి, ఇప్పుడు హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నేహాశెట్టి. మంగళూరులో పుట్టిన ఈ బ్యూటీ.. బెంగళూరులో పెరిగింది. చదువుతున్నప్పుడే మోడలింగ్ ని కెరీర్ గా ఎంచుకున్న నేహా.. 2014 మిస్ మంగళూరు బ్యూటీ పీజెంట్ గా అవార్డు సొంతం చేసుకుంది. 2015లో మిస్ సౌత్ ఇండియా రన్నరప్ గా నిలిచింది. ఈ క్రమంలోనే ‘ముంగారు ముళే 2’ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. సినిమా రిజల్ట్ ఏం వచ్చిందనేది పక్కనబెడితే.. నేహా యాక్టింగ్ విషయంలో ప్రశంసలు దక్కించుకుంది.
ఇక తెలుగులో పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ‘మోహబూబ’ మూవీ కోసం నేహాశెట్టిని హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు. అయితే తెలుగువాళ్లకు ఈమె అంతగా పరిచయం లేకపోవడంతోపాటు స్టోరీ కూడా తేలిపోయింది. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫెయిలైంది. దీని తర్వాత న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో ఆరు నెలల యాక్టింగ్ కోర్స్ చేసొచ్చింది. ఇక గతేడాది ‘గల్లీరౌడీ’లో హీరోయిన్ గా చేసింది. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ మూవీలో చిన్న రోల్ చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన ‘డీజే టిల్లు’లో రాధికగా నటించి కుర్రాళ్ల ఫేవరెట్ అయిపోయింది. ప్రస్తుతం కార్తికేయ ‘బెదురులంక 2012’ సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. ఇకపోతే ఈరోజు ఆమె పుట్టినరోజు కావడం విశేషం. ఇలాంటి టైంలో ఆమె చిన్నప్పటి ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.