ఆమె కజిన్స్ అందరూ స్టార్ హీరోయిన్లగా పేరు తెచ్చుకున్నారు. ఈమె కూడా అలానే హీరోయిన్ గా పలు సినిమాలు చేసింది. గ్లామర్ విషయంలోనూ ఈమెని చూస్తే మీ బుర్ర తిరిగిపోవడం గ్యారంటీ.
ఆమె ప్రముఖ హీరోయిన్. బాలీవుడ్ స్టార్స్ అయిన ఇదరు ముదుగుమ్ములకు ఈమె కజిన్. ఆల్రెడీ ఇండస్ట్రీతో సంబంధాలు ఉండటంతో చాలా ఈజీగానే హీరోయిన్ అయిపోయింది. కానీ చేసిన సినిమాలు వేళ్లపై లెక్కపెట్టొచ్చు. అందులో కొన్ని హిట్ టాక్ తెచ్చుకుంటే మరికొన్ని బాక్సాఫీస్ దగ్గర ఫెయిలయ్యాయి. యాక్టింగ్ పరంగా ఆమె బాగానే చేసినప్పటికీ.. ఎందుకో ఆమెకు సినిమాలు కలిసిరాలేదని చెప్పాలి. అయితేనేం ఓ విషయంలో మాత్రం ఈ బ్యూటీ అస్సలు నో చెప్పదు. మరి ఈ హీరోయిన్ ఎవరో కనిపెట్టారా? లేదా చెప్పేయమంటారా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. ప్రియాంక చోప్రా పేరు చెప్పగానే ఒకప్పుడు బాలీవుడ్ హీరోయిన్, ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయిపోయిందని మాట్లాడుకుంటున్నారు. ఈమెకు కజిన్స్ చాలామంది ఉన్నారు. వారిలో పరిణీతి చోప్రా, మీరా చోప్రా, మన్నారా చోప్రా లాంటి వాళ్లు ఉన్నారు. పైన ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి పేరు మన్నార్ చోప్రా. హర్యానాలో పుట్టిన ఈమె.. దిల్లీలో చదువంతా పూర్తి చేసింది. ఆ తర్వాత ముంబయికి షిఫ్ట్ అయిపోయింది. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసి, 40కి పైగా యాడ్స్ లో యాక్ట్ చేసింది. అలా గుర్తింపు తెచ్చుకుని సినిమా ఛాన్స్ కొట్టేసింది.
ఫ్యాషన్ డిజైనర్, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా కొన్నాళ్లపాటు వర్క్ చేసిన మన్నారా చోప్రా.. ‘జిద్’ అనే హిందీ మూవీతో హీరోయిన్ అయిపోయింది. అదే ఏడాది ‘ప్రేమ గీమ జాన్తా నై’ చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తమిళంలో రెండు మూవీస్ చేసిన ఈ బ్యూటీ.. సునీల్ తో ‘జక్కన్న’, సాయిధరమ్ తేజ్ ‘తిక్క’, పూరీ జగన్నాథ్ ‘రోగ్’, బెల్లంకొండ శ్రీనివాస్ ‘సీత’ మూవీలో హీరోయిన్స్ గా చేసింది. వీటిలో చాలావరకు ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయాయి. అలా మన్నారా కెరీర్ సైడ్ అయిపోయింది. 2021లో ఓ వెబ్ సిరీస్ చేసిన ఈమె.. ఆల్బమ్ సాంగ్స్ లోనూ నటిస్తూ బిజీ అయిపోయింది. ఇక గ్లామర్ విషయంలో ఈమె అస్సలు నో చెప్పదు. ఇన్ స్టాలో ఫొటోలు చూస్తే ఈ విషయం ఈజీగా అర్థమైపోతుంది. సరే ఇదంతా పక్కనబెడితే.. ఈ హీరోయిన్ చిన్నప్పటి పిక్ చూసి మీలో ఎంతమంది గుర్తుపట్టారు? కింద కామెంట్ చేయండి.