ఆమెని చూస్తే మీరు కచ్చితంగా అక్కడే ఆగిపోతారు. హీరోయిన్ గా సినిమాల్లో కాదు.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉంటుంది. అవి చూస్తే మీరు రెచ్చిపోవడం గ్యారంటీ. ఆమెకు అవి చాలా నార్మల్ గా అనిపించొచ్చు. కానీ నెటిజన్లు మాత్రం ప్రతిసారి ఆమెని చూసి కంట్రోల్ తప్పుతుంటారు. ఎందుకంటే ఫిజిక్ అలాంటిది. పైనుంచి దిగువ వరకు కుందనపు బొమ్మలా ఉంటుంది. కుర్రాళ్లయితే అమె లాంటి టెడ్డీబేర్ ఉండాలని కోరుకుంటారు. ఇక ఛాన్స్ దొరికినా ప్రతిసారీ అందాల ప్రదర్శనతో ఆకట్టుకుంటూనే ఉంది. మరి ఆమె ఎవరో గుర్తుపట్టారా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. పైన ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి ఇప్పుడు హీరోయిన్ గా సెటిలైపోయిన కేతికా శర్మ. దిల్లీలో పుట్టిపెరిగిన ఈమె.. చదువు పూర్తయిన తర్వాత మోడలింగ్ లోకి అడుగుపెట్టింది. కానీ డబ్ స్మాష్ వీడియోలతో పాపులర్ అయిపోయింది. 2016లో యూట్యూబ్ లో ఈమె చేసిన ఓ వీడియో.. తెగ వైరల్ అయింది. దీంతో ఈమెకు చాలా ఫేమ్ వచ్చింది. అలా పూరీ జగన్నాథ్ కాంపౌండ్ లోకి ఎంటరైంది. ఆయన కొడుకు ఆకాశ్ హీరోగా చేసిన ‘రొమాంటిక్’ చిత్రంతో కేతిక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా పెద్దగా ఆడనప్పటికీ.. కేతిక గ్లామర్ గురించి అందరూ మాట్లాడుకున్నారు.
ఇక ఈ సినిమా చేస్తున్న టైంలోనే నాగశౌర్య ‘లక్ష్య’లో హీరోయిన్ గా చేసింది. ఈ సినిమా కూడా కేతికకు కలిసిరాలేదు. ఇక మెగాహీరో వైష్ణవ్ తేజ్ తో కలిసి ‘రంగరంగ వైభవంగా’ సినిమా చేసింది. ఇది కూడా బాక్సాఫీస్ దగ్గర ఫెయిలైంది. ఇలా హీరోయిన్ గా చేసిన మూడు సినిమాలు కూడా కేతికకు సక్సెస్ ఇవ్వలేకపోయాయి. అయినా సరే ఏ మాత్రం నిరుత్సాహపడకుండా గ్లామర్ విషయంలో హద్దులు చెరిపేస్తూ ఫొటోస్ పోస్ట్ చేస్తూ ఉంది. వాటిని చూసి నెటిజన్స్ అయితే ఫుల్ గా కంట్రోల్ తప్పుతున్నారు. తాజాగా ఆమె చిన్నప్పటి ఫొటో ఒకటి వైరల్ అయింది. ఇప్పుడు ఆమె ఫొటోతో పోల్చి చూస్తున్న నెటిజన్స్.. అప్పుడు, ఇప్పుడు భలే క్యూట్ గా ఉంది కదా అని మాట్లాడుకుంటున్నారు. మరి కేతిక హాట్ ఫొటోస్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.