బాలయ్య 'వీరసింహారెడ్డి' బ్యూటీ హనీరోజ్ రోజురోజుకీ రెచ్చిపోతోంది. ఫొటోలు, వీడియోలు వరసపెట్టి పోస్ట్ చేస్తూ అందరినీ కవ్విస్తోంది. దానికి తోడు తాజాగా కొత్త లుక్ లో దర్శనమిచ్చింది.
ఒక్క సినిమాతో పాపులారిటీ సంపాదించొచ్చా? అంటే కచ్చితంగా అవుననే చెప్పొచ్చు. అలా ఎంతోమంది హీరోయిన్లు జస్ట్ ఒక్కటే మూవీలో నటించి ఓవర్ నైట్ స్టార్స్ అయినవాళ్లు చాలామందే ఉన్నారు. తాజాగా ఆ లిస్టులో హనీరోజ్ చేరింది. బాలయ్యతో ‘వీరసింహారెడ్డి’ సినిమా చేసి హిట్ కొట్టడం, అందులో రెండు డిఫరెంట్ పాత్రల్లో నటించి అలరించడం ఈమెకు చాలా అంటే చాలా ప్లస్ అయిపోయింది. సినిమా రిలీజ్ తర్వాత నుంచి పూటకో ఫొటో, రోజుకో వీడియో అన్నట్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉంది. అలాంటి ఈమె సడన్ గా కొత్త లుక్ లో కనిపించి అందరికీ షాకిచ్చింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. మలయాళ నటి అయిన హనీరోజ్ చాన్నాళ్ల క్రితమే తెలుగులో సినిమాలు చేసింది. ఆలయం(2008), ఈ వర్షం సాక్షిగా(2014) సినిమాల్లో వన్ ఆఫ్ ది హీరోయిన్ గా చేసింది. కానీ ఆమెకు అదృష్టం పెద్దగా కలిసి రాలేదు. గతేడాది మోహన్ లాల్ తో ‘మాన్ స్టర్’లో నటించిన హనీరోజ్ తన యాక్టింగ్ తో అందరినీ మెప్పించింది. సంక్రాంతికి రిలీజైన ‘వీరసింహారెడ్డి’తో ఫుల్ ఫేమస్ అయిపోయింది. ప్రస్తుతం మలయాళంలో ఓ సినిమా చేస్తున్న ఈ బ్యూటీ.. షాప్ ఓపెనింగ్స్ మాత్రం వరసపెట్టి చేస్తోంది. అందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోల్ని ఎప్పటికప్పుడూ పోస్ట్ చేస్తూనే ఉంది.
తాజాగా బ్లూ కలర్ మెరుపుల డ్రస్ తో ఉన్న ఫొటోని పోస్ట్ చేసిన హనీరోజ్.. బాబ్డ్ హెయిర్ తో కనిపించింది. అయితే జత్తు నిజంగానే కట్ చేసుకుందా? అలా సెట్టింగ్ చేసుకుందా అనేది తెలియదు. మరో వీడియోలో పింక్ కలర్ డ్రస్ వేసుకున్న హనీరోజ్.. కుర్రాళ్లను అస్సలు చూపు తిప్పుకోనివ్వకుండా చేసింది. అలా వయ్యారంగా నడుస్తూ వచ్చినప్పటికీ.. హనీరోజ్ ఫిజిక్ చూసి అందరూ పిచ్చెక్కిపోతున్నారు. ఇలా జస్ట్ నెలల వ్యవధిలోనే పూర్తిగా మారిపోయిన హనీరోజ్.. ముందు ముందు ఇంకెలాంటి గెటప్స్ లో కనిపిస్తుందో చూడాలి? మరి హనీరోజ్ లేటెస్ట్ ఫొటో, వీడియోలపై మీరేం అంటారు. కింద కామెంట్ చేయండి.