పెళ్లికళ వచ్చేసిందే బాలా
పల్లకిని తెచ్చేసిందే బాలా..
మంటపం రమ్మంటుంది ఆజా ఆజా
జంటపడు వేళయ్యింది ఆజా ఆజా
ప్రస్తుతం హన్సిక సంతోషాన్ని చూస్తుంటే.. ఈ పాట బ్యాక్‌గ్రౌండ్‌లో వేసుకోవాల్సిందే అనిపిస్తోంది. మరో రెండు రోజుల్లో పెళ్లి ఉండటంతో ఇప్పటికే హన్సికలో పెళ్లి కళ వచ్చేసింది. సంతోషంగా.. చురుగ్గా పెళ్లికి ముందు జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా, హన్సిక మెహందీ వేడుక జరిగింది. ఆ వేడుకలో హన్సిక ఎంతో సరదాగా, నవ్వుతూ, తుళ్లుతూ ఎంజాయ్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక, ఆమె కాస్ట్యూమ్ విషయానికి వస్తే.. రెడ్ డ్రెస్‌లో.. లైట్ గ్రోసరీస్‌తో చాలా ఇంప్రెసివ్‌గా కనిపిస్తోంది.
ఓ వీడియోలో ఆమె సోఫాలో కూర్చుని ఓ పాటకు శరీరాన్ని కదిల్చింది. ఫ్యాన్స్ ఈ వీడియోలను, ఫొటోలను హన్సిక ఫ్యాన్స్ ఖాతాలలో షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక, హన్సిక, సోహైల్ కాతూరియా అనే వ్యాపారవేత్తను ప్రేమించి పెళ్లి చేసుకుంటోంది. వీరి పెళ్లి డిసెంబర్ 4వ తేదీన రాజస్తాన్, జైపూర్‌లోని ముండోటా కోటలో జరగనుంది. కాగా, హన్సిక మోత్వాని 2003లో వచ్చిన ‘‘హవా’’ అనే హిందీ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఈ సినిమాతో బాల నటిగా పరిచయం అయింది. హృతిక్ రోషన్ హీరోగా వచ్చిన కోయి మిల్ గయా అనే సినిమాలోనూ నటించింది .
2007లో వచ్చిన దేశముదురు సినిమాతో హీరోయిన్గా మారింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన నటించింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో హన్సిక స్టార్ హీరోయిన్ అయిపోయింది. తెలుగులో ఎన్టీఆర్, రామ్, కళ్యాణ్ రామ్, నితిన్, సిద్ధార్ద్, రవితేజ వంటి హీరోలతో కలిసి నటించింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేసింది. ఇక, కన్నడలో పునీత్ రాజ్ కుమార్‌తో కలిసి ‘‘బిందాస్’’ అనే సినిమా చేసింది. ఈ సినిమా 2008లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఈ సినిమా తర్వాత హన్సిక ఎప్పుడూ కన్నడలో సినిమాలు చేయలేదు.