కమెడియన్ కిరాక్ ఆర్పీ తన ఇంటర్వ్యూలతో భారీ వివాదాన్ని రాజేశాడు. జబర్దస్త్ షో వాళ్లు.. ఆర్టిస్ట్‌లను బానిసలుగా చూస్తారు.. తిండి కూడా సరిగా పెట్టరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసి వివాదాన్ని రాజేశాడు. ఆ తర్వాత హైపర్ ఆది, రామ్ ప్రసాద్‌లు ఆర్పీకి కౌంటర్ ఇచ్చి.. అతడు చెప్పేవన్ని అబద్దాలే అని తెలిపారు. ఈ క్రమంలో జబర్దస్త్ మాజీ ప్రొడక్షన్ మేనజర్ ఏడుకొండలు తెర మీదకు రావడంతో.. ఈ వివాదం మరింత ముదిరింది. ఏడుకొండలు కిరాక్ ఆర్పీని ఓరేంజ్‌లో ఏకి పారేశాడు. పనిలో పనిగా.. జబర్దస్త్ వీడి వేరే ఛానల్‌లో షోలు చేస్తున్న సుడిగాలి సుధీర్, గెటప్ శీనులపై కూడా తీవ్ర ఆరోపణలు చేశాడు. వీళ్లంతా మర్యాదగా జబర్దస్త్‌కి తిరిగిరావాలని.. లేదంటే అందరి బండారం బయటపెడతానంటూ హెచ్చరించాడు. అంతేకాక తాను అప్పట్లో సుధీర్, గెటప్ శీను, ఆటో రాంప్రసాద్‌తో పాటు మిగిలిన కమెడియన్లకు తలో పది లక్షలు ఇప్పించానని చెప్పుకొచ్చాడు ఏడుకొండలు.
అంతటితో ఆగక.. జబర్దస్త్‌లో చేస్తున్నప్పుడు గెటప్ శీను రెమ్యూనరేషన్ పెంచమని అడిగేవాడని.. కారు కొనుక్కొవాలని అడిగితే.. తన కారు ఇచ్చేశానని చెప్పుకొచ్చాడు ఏడుకొండలు. దాంతో ఈ వ్యాఖ్యలపై గెటప్ శీను స్పందించాడు. ఇన్‌డైరెక్ట్‌గా ఏడుకొండలిని ఉద్దేశిస్తూ.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ‘నేను అమ్మాను అని చెప్పడానికి.. ఇచ్చేశాను అని చెప్పడానికి చాలా వ్యత్యాసం ఉందయ్యా.. కెమెరా ఉంటే సాలు సృహ లేకపోతే ఎలాయ్యా’.. అంటూ కొండలు ఉన్నట్టుగా ఉన్న ఎమోజీని షేర్ చేశాడు. దీన్ని బట్టి ఇది ఏడుకొండలకి కౌంటర్ అని తేలిపోయింది. దాంతో జనాలు.. అంటే.. ఏడుకొండలు కారు అమ్మితే తాను కొనుక్కున్నానని.. ఇచ్చేశాను అనడానికి.. అమ్మాను అనడానికి చాలా వ్యత్యాసం ఉందన్నట్టుగా గెటప్ శీను క్లారిటీ ఇచ్చాడు.
ఇక ఆ తర్వాత గెటప్ శీను డైరెక్ట్ ఎటాక్ మొదలుపెట్టాడు. ఏడుకొండల్ని సోషల్ మీడియా వేదికగా విమర్శించాడు. డైరెక్ట్‌గా ఏడుకొండలు ఫొటోని పెట్టి.. ‘నేను చేసిన బిల్డప్ బాబాయ్ క్యారెక్టర్‌కి ఇతనే స్పూర్తి’ అంటూ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. నేను డబ్బులు ఇచ్చా.. కారు ఇచ్చా.. అది చేశా.. ఇది చేశా.. అని ఏడుకొండలు చెప్తుండటంతో.. అతన్ని బిల్డప్ బాబాయ్‌తో పోల్చుతూ గాలి తీసేశాడు గెటప్ శ్రీను. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.