ప్రముఖ బాలీవుడ్ హీరో మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్.. గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విభిన్న సినిమాలు తీస్తూ.. బాలీవుడ్ లోనే కాకుండా సౌత్ లోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్నారు హీరో అమీర్ ఖాన్. ఎంత మిస్టర్ పర్ఫెక్ట్ అయినా ఆమిర్ ఖాన్ కొన్ని సార్లు కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేయడం.. కాంట్రవర్సీ విషయాల్లో జోక్యం చేసుకోవడం లాంటి చేస్తుంటారు.
తాజాగా బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ నటించిన ఓ యాడ్‌పై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఆ యాడ్ ఓ మతాన్ని కించపరిచే విధంగా ఉందని.. మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయని ఆయనపై మండి పడుతున్నారు. తాజాగా ఆమిర్ ఖాన్ కి సంబంధించి సీయట్ టైర్ల సంస్థ ఇటీవల ఈ యాడ్‌ను విడుదల చేసింది. రోడ్లు ఉన్నది టపాకులు పేల్చడానికి కాదంటూ ఆమిర్ ఖాన్ ఈ యాడ్ లో డైలాగు చెప్పడమే ఈ వివాదానికి కారణం అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ సంస్థను బాయ్‌కాట్ చేయాలంటూ నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు.
దేశ వ్యాప్తంగా హిందువులు ఎంతో సంతోషంగా జరుపుకునే దీపావళి త్వరలో రాబోతుంది.. ఈ నేపథ్యంలో ఆమిర్ ఖాన్ ఇలాంటి యాడ్ లో నటించడం.. వివాదానికి దారితీస్తోంది. ప్రజలకు ఆమిర్ ఖాన్ క్షమాపణలు చెప్పాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఆర్‌పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయెంకాపై కూడా నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. వెంటనే యాడ్‌ను తొలగించాలని సీయట్ సంస్థను డిమాండ్ చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా అందరూ సంతోషంగా జరుపుకునే పండుగను కించపర్చుతూ సీయట్ కంపెనీ పబ్లిసిటీ ఎందుకు చేసుకుంటోందని ప్రశ్నిస్తున్నారు.
#BoycottCeatTyres #BoycottCeat @CEATtyres Anti Hindus will not be tolerated any further. https://t.co/zEXmcI6d3o
— Gaurav Arora 🇮🇳 (@GauravArora0409) September 28, 2021
Roads aren’t the best place to show our talented dance moves, but until we realize this, switch to CEAT SecuraDrive.#CEATtyres #SecuraDrive #SwitchToSecuraDrive pic.twitter.com/h6LtukZhnp
— CEAT TYRES (@CEATtyres) September 29, 2021