ఫ్యాషన్ డిజైనర్ ముఖేష్ నారంగ్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు ఆమె వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ మధ్యకాలంలో ఆత్మహత్య పర్వాలు ఎక్కువయిపోతున్నాయి. చిన్న సమస్యలకు కూడా కొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. చదువుకున్న వారు సెలెబ్రిటీలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. సమస్యకు పరిష్కారం ఆలోచించకుండా ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా, ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ముస్కాన్ నారంగ్ ఆత్మహత్య చేసుకున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని తన నివాసంలో స్కార్ఫ్‌తో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. గురువారం రాత్రి ఈ సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌కు చెందిన ముస్కాన్ ముంబైలోని ఓ ప్రముఖ కంపెనీలో ఫ్యాషన్ డిజైనర్‌గా పని చేస్తున్నారు. హోళీ పండుగ రోజు ఉత్తర ప్రదేశ్‌లోని ఇంటికి వచ్చింది. ఆ తర్వాత మళ్లీ ముంబై వెళ్లలేదు.
గురువారం రాత్రి ఇంట్లో వాళ్లతో కలిసి భోజనం చేసింది. తర్వాత తన గదిలోకి వెళ్లి నిద్రపోయింది. మిగిలిన కుటుంబసభ్యులు కూడా తమ గదుల్లోకి వెళ్లి నిద్రపోయారు. శుక్రవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ముస్కాన్ తల్లి ఉమ నిద్రలేచింది. ముస్కాన్ నారంగ్ గది తలుపులు తెరిచి ఉన్నాయి. ఉమతో పాటు ముస్కాన్ చెల్లెలు కూడా ఆమె కోసం వెతకటం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే మేడ మీద ఉన్న స్టోర్ రూమ్‌కు వెళ్లారు. అక్కడ ముస్కాన్ ఫ్యాను వేలాడుతూ కనిపించింది. దీంతో ఇద్దరూ షాక్ అయ్యారు. గట్టిగా అరుస్తూ మిగిలిన కుటుంబసభ్యుల్ని పిలిచారు. ఆ అరుపులు విని కుటుంబసభ్యులతో పాటు.. పొరిగింటి వారు కూడా అక్కడికి వచ్చారు. ముస్కాన్‌ను ఉరి నుంచి కిందకు దింపి వైద్య పరీక్షలు చేయించారు.
ఆమె చనిపోయినట్లు తేలటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ముస్కాన్ చనిపోవటానికి ముందు తీసుకున్న ఓ వీడియో దొరికింది. ‘‘ ఇదే నా చివరి వీడియో.. దీని తర్వాత మీరు నన్ను చూడలేకపోవచ్చు. నా సమస్యలు ఏంటో చెప్పమని అంటూ ఉన్నారు. కానీ, ఏం చెప్పను. నా చావుకు ఎవరూ కారణం కాదు’’ అని పేర్కొంది. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.