ఈ మద్య ఇండస్ట్రీలో చిన్న సినిమాల హవా నడుస్తుంది. కంటెంట్ బాగుంటే ఎలాంటి చిత్రాలైనా ప్రజలు ఆదరిస్తారని పలుమార్లు రుజువైంది. ఇటీవల రిలీజ్ అయిన కాంతార కేవలం 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు.. ఈ చిత్రం పలు భాషల్లో రిలీజ్ అయి దాదాపు 400 కోట్లు వసూళ్లు చేసింది.. ఇక తమిళనాట రూ. 5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ‘లవ్ టుడే’ దాదాపు 60 కోట్లు వసూళ్లు చేసినట్లు ఫిలిమ్ వర్గాల్లో టాక్. ఈ చిత్రం తెలుగు లో అదేపేరు తో ప్రముఖ నిర్మాత దిల్ రాజు డబ్ చేశారు. తెలుగు లో కూడా మంచి హిట్ టాక్ తెచ్చుకుంది లవ్ టుడే.
తమిళనాట చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ మొదలు పెట్టిన ప్రదీప్ రంగనాథన్ ‘కోమలి’ మూవీతో దర్శకుడిగా వెండితెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీలో జయం రవి, కాజల్ హీరోహీరోయిన్లుగా నటించారు. డిఫరెంట్స్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయం అందుకుంది. ప్రదీప్ రంగనాథన్ తనే హీరోగా నటిస్తూ స్వియదర్శకత్వంలో వచ్చిన లవ్ టుడే తమిళనాట బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ మూవీలో ప్రదీప్ రంగనాథన్ కి జోడీగా ఇవానా నటించింది. సత్యరాజ్, రాధిక, యోగిబాబు కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని తెలుగులో దిల్ రాజ్ డబ్ చేసి రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో కామెడీ, రొమాన్స్ తో పాటు సోషల్ మేసేజ్ ఉండటంతో యూత్ కి బాగా కనెక్ట్ అయ్యింది.
ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా ప్రదీప్ రంగనాథన్ పలు చోట్ల థియేటర్లలో అభిమానులతో సందడి చేస్తున్నారు. తాజాగా ఓ థియేటర్లో అభిమానులతో కూర్చొని మూవీ వీక్షించి బయటకు వచ్చిన ప్రదీప్ రంగనాధన్ ని ఓ అభిమాని హఠాత్తుగా వచ్చి పైకి ఎత్తాడు… సూపర్ బ్రో సినిమా నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది అంటూ ఉక్కిరి బిక్కిరి చేశాడు. ఆ అభిమాని సంతోషాన్ని చూసి ఒక్కసారే అవాక్కయ్యాడు హీరో కమ్ డైరెక్టర్ ప్రదీప్ రంగనాధన్. దీనికి సంబందించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.