గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. గత ఏడాది కృష్ణం రాజు, సూపర్ స్టార్ కృష్ణ, సీనియర్ నటులు సత్యనారాయణ, చలపతిరావు లాంటి సినీ దిగ్గజాలు కన్నుమూయడంతో ఇండస్ట్రీ శోక సంద్రంలో మునిగిపోయింది. తెలుగు, తమిళ స్టార్ రైటర్ భూపతి రాజా తండ్రి, ప్రముఖ రచయిత బాల మురుగన్ కన్నుమూశారు.
బాలమురుగన్ తమిళ, తెలుగు ఇండస్ట్రీలో సూపర్ హిట్ చిత్రాలకు కథలు అందించారు. ఇండస్ట్రీలో మంచి రచయితగా పేరు తెచ్చుకున్న బాల మురుగన్ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ.. చెన్నైలో తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. ఈ విషయాన్ని ఆయన తనయుడు ప్రముఖ సినీ రచయిత భూపతిరాజా తెలిపారు. బాలమురుగన్ తెలుగులో ధర్మదాత, ఆలుమగలు, సోగ్గాడు, సావాసగాళ్లు, జీవన తరంగాలు లాంటి హిట్ చిత్రాలకు కథ అందించారు. అంతేకాదు గీతా ఆర్ట్స్ తొలిసారి నిర్మించిన ‘బంట్రో భార్య’ చిత్రానికి కథ అందించారు బాలమురుగన్.
శోభన్ బాబు నటించిన సోగ్గాడు చిత్రం ఎంత హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. తమిళ ఇండస్ట్రీలో స్టార్ నటుడు శివాజీ గణేషన్ కి దాదాపు 40 చిత్రాల వరకు ఆయన కథలు అందించారు. బాలమురుగన్ మృతి విషయం తెలిసిన తెలుగు, తమిళ ఇండస్ట్రీ శోక సంద్రంలో మునిగిపోయింది. సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఆయన మృతితో రచయిత భూపతిరాజా ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి.