తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న విక్టరీ వెంకటేష్, మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన కుర్ర హీరో వరుణ్ తేజ్ తోడల్లుళ్లుగా నటించిన సినిమా ‘ఎఫ్3’. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన సూపర్ హిట్ సినిమా ‘ఎఫ్ 2’కి సీక్వెల్ గా దీన్ని తెరకెక్కించారు. ఎఫ్ 2 కి సీక్వెల్ గా ‘ఎఫ్3’ మే 27న విడుదలైన ఈ చిత్రం మంచి విజయం అందుకుంది.
ఓవర్సీస్ లో ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీ రిలీజ్ అయి ఆరు రోజులు అవుతున్నా థియేటర్లో ఫుల్లుగా రన్ అవుతుంది. కలెక్షన్లు కూడా బాగానే రాబడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ‘ఎఫ్3’ మూవీకి ఇప్పటి వరకు రూ.46 కోట్ల వరకు రాబట్టింది.
ఇది చదవండి: Hyderabad: అద్భుతం చేసిన హైదరాబాద్ వైద్యులు.. తెగిన చేయిని తిరిగి అతికించారు!
సోషల్ మీడియాలో ఈ మద్య పలు చిత్రాలకు సంబంధించిన న్యూస్ లు ఇట్టే వైరల్ అవుతున్నాయి.. ఈ క్రమంలో ఎఫ్ 3 పై కూడా ఒక రూమర్ వస్తుంది. ఈ మూవీ త్వరలో ఓటీటీలోకి రాబోతుందని వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ రూమర్లపై చిత్ర యూనిట్ స్పందించారు. ఇందుకు సంబంధించి డైరెక్టర్ అనిల్ రావిపూడి, హీరోలు వెంకటేశ్, వరుణ్ తేజ్‌లు వీడియో రిలీజ్ చేశారు.
ఎఫ్ 3 చిత్రాన్ని ఎంతో గొప్పగా ఆదరించి.. మంచి విజయాన్ని అందించిన ప్రేక్షక దేవుళ్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మూవీ మరో 8 వారాల వరకు ఎఫ్ 3 ఓటీటీకి వచ్చే ప్రసక్తే లేదు. హ్యాపీగా ఫ్యామిలీతో థియేటర్ కి వెళ్లి చూస్తేనే ఆనందంగా ఉంటుందని అన్నారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.