సాధారణంగా సినిమా దర్శకుడు పెళ్లి చేసుకోవడం పెద్ద విశేషం కాదు. కానీ హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటే మాత్రం అది కచ్చితంగా విశేషమే. గతంలో పలువురు డైరెక్టర్స్.. ఇలానే తమ సినిమాల్లో వర్క్ చేసిన భామల్ని ప్రేమించి, పెళ్లి చేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఆ లిస్టులోకి మరో దర్శకుడు చేరిపోయేందుకు రెడీ అయిపోయాడు. త్వరలోనే గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన న్యూస్, ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.
ఇక విషయానికొస్తే.. కొన్నిరోజుల ముందు బాలీవుడ్ లో ‘దృశ్యం 2’కు దర్శకత్వం వహించిన అభిషేక్ పాఠక్.. ఈ సినిమాతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. చాలా రోజుల తర్వాత హిందీలో వందల కోట్లు కలెక్షన్స్ సాధించిన చిత్రం తీశాడు. ఇకపోతే ఈ డైరెక్టర్.. గతేడాది సెప్టెంబరులో నటి శివలికా ఒబెరాయ్ కి టర్కీలో ప్రపోజ్ చేశాడు. ఆ వీడియోని అప్పట్లోనే ఇన్ స్టాలో ఈ ఇద్దరూ కూడా పోస్ట్ చేశారు. ఆ తర్వాత నుంచి ఆడపాదడపా జంటగా కనిపిస్తున్న అభిషేక్-శివలికా త్వరలో ఏడడుగులు వేయనున్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే అభిషేక్ నిర్మాతగా వ్యవహరించిన ‘ఖుదా హఫీజ్’లో శివలికా నటించింది. ఈ సినిమాకు పనిచేస్తున్నట్లు వీళ్లిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. గతేడాది ప్రపోజ్ చేసుకున్నారు. ఫిబ్రవరిలో గోవా బీచ్ టౌన్ లో రెండు రోజుల పాటు జరగబోయే పెళ్లితో ఒక్కటవ్వనున్నారు. ఈ వేడుకకు కుటుంబ సభ్యులతో పాటు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా హాజరు కానున్నట్లు తెలుస్తోంది. మరి డైరెక్టర్-హీరోయిన్ పెళ్లి చేసుకోనుండటంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని చెప్పండి.