జనరల్ గా సినిమాలకు, ఇండస్ట్రీకి హీరోయిన్స్ దూరమయ్యాక మళ్లీ ఎప్పుడెప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తారా? లేక ఎప్పుడెప్పుడు సోషల్ మీడియా లేదా టీవీ షోలతో పలకరిస్తారా? ఎదురు చూస్తుంటారు ఫ్యాన్స్. కానీ.. కొంతమంది హీరోయిన్స్ ఒక్కసారి ఇండస్ట్రీలో సినిమాలు మానేస్తే.. చాలా ఏళ్ళ వరకు కనిపించకుండా పోయిన హీరోయిన్లను చాలామందిని చూశాం. ముఖ్యంగా తెలుగులో ఒకటి రెండు సినిమాలే చేసి మానేసిన హీరోయిన్స్ ఉన్నారు. కానీ.. హీరోయిన్ గా దాదాపు 40కి పైగా సినిమాలు చేసి.. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో మంచి క్రేజ్ సంపాదించుకున్న వారిలో నటి రవళి ఒకరు.
రవళి గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ఏపీలోని గుడివాడలో పుట్టి పెరిగిన రవళి.. తెలుగులో హీరోయిన్ గా చాలా సూపర్ హిట్స్ చేసింది. జగపతి బాబు, శ్రీకాంత్, నాగార్జున, రాజశేఖర్, రాజేంద్రప్రసాద్, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి స్టార్ హీరోల సరసన సినిమాలు చేసింది. అలాగే తమిళంలో విజయ్ కాంత్, సత్యరాజ్, పార్తీబన్ లతో పాటు హిందీలో మిథున్ చక్రవర్తి లాంటి హీరోలతో హిట్స్ అందుకుంది. 18 ఏళ్లకే నటిగా మలయాళం సినిమాతో కెరీర్ ప్రారంభించిన రవళి.. తెలుగులో శుభాకాంక్షలు, పెళ్లిసందడి, వినోదం, అలీబాబా అరడజను దొంగలు, రాముడొచ్చాడు లాంటి హిట్స్ తో సూపర్ క్రేజ్ సొంతం చేసుకుంది.
ఇక తమిళ, హిందీ భాషలలో మరిన్ని వరుసగా హిట్స్ అందుకుంటూ మంచి స్టార్డమ్ అందుకుంది. కానీ.. 2007లో నీలి కృష్ణ అనే వ్యక్తిని పెళ్ళాడి నటనకు గుడ్ బై చెప్పేసింది. పెళ్లికి ముందు కొన్ని సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించింది. రవళికి ఇద్దరు కుమార్తెలు. కాగా.. సీరియల్ నటి హరిత ఈమెకు సొంత సిస్టర్. ఇదిలా ఉండగా.. పెళ్లయ్యాక సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న రవళి.. తాజాగా తిరుపతిలో దైవదర్శనానికి వచ్చి కెమెరా కంటపడ్డారు. ప్రస్తుతం రవళి చాలా మారిపోయింది. ఈ విషయాన్నీ లేటెస్ట్ వీడియోలో చూస్తే అర్థమవుతుంది. అయితే.. ఒకప్పటి ఫేవరేట్ హీరోయిన్ రవళి ఇలా మారిపోయిందా అని ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. కానీ.. ఇన్నేళ్ల తర్వాతైనా ఆమెను మళ్లీ చూసినందుకు హ్యాపీగా ఉందని అంటున్నారు నెటిజన్స్. మరి నటి రవళి గురించి, ఆమె నటించిన సినిమాల గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.