సాధారణంగా వేరే భాషలకు చెందిన స్టార్ హీరోలతో సినిమాలు చేయాలని చాలామంది దర్శకులు భావిస్తుంటారు. అవకాశం వస్తుందో రాదో చెప్పలేం గానీ వస్తే మాత్రం ఫ్యాన్స్ పండగ చేసుకునే సినిమా చేస్తానని చెబుతుంటారు. తాజాగా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సౌత్ సినిమా హీరోల గురించి మాట్లాడి సర్ప్రైజ్ చేశాడు. బాలీవుడ్ లో సౌత్ ఫ్లేవర్ తో సినిమాలు తీసే దర్శకులలో రోహిత్ శెట్టి ఒకరు. తాజాగా రణవీర్ సింగ్ హీరోగా ‘సర్కస్’ అనే సినిమా రెడీ చేశాడు. డిసెంబర్ 23న ఈ సినిమా రిలీజ్ కాబోతుండగా.. ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ లాంచ్ తో ప్రమోషన్స్ ప్రారంభించింది చిత్రబృందం.
తాజాగా విడుదలైన సర్కస్ ట్రైలర్ ట్రెండ్ అవుతుండగా.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రోహిత్ శెట్టి మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పటివరకు ఎన్నోసార్లు తనకు సౌత్ సినిమాలంటే చాలా ఇష్టమని చెబుతూ వచ్చిన రోహిత్ శెట్టి.. సౌత్ సినిమాల ఆధారంగానే సింగం, సింగం రిటర్న్స్, సింబా, చెన్నై ఎక్సప్రెస్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో బాలీవుడ్ లోని అందరు స్టార్స్ తో సినిమాలు చేసిన రోహిత్.. సౌత్ లో ఎవరెవరితో సినిమాలు చేయాలని ఉంది? అనే ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానం చెప్పాడు. రోహిత్ ఆన్సర్ తెలిసిన సౌత్ ఇండియన్ ఆడియెన్స్ సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతున్నారు.
ఈ సందర్భంగా రోహిత్ శెట్టి మాట్లాడుతూ.. తనకు సౌత్ హీరోలలో అల్లు అర్జున్, దళపతి విజయ్, అజిత్, కార్తీలంటే చాలా ఇష్టమని చెప్పాడు. అలాగే వాళ్ళతో సినిమాలు చేసేందుకు చాలా ఎక్సయిట్ మెంట్ తో వెయిట్ చేస్తున్నట్లు తెలిపాడు. దీంతో అల్లు అర్జున్ అంటే ఇష్టమని స్టార్ డైరెక్టర్ అనేసరికి.. బన్నీ ఫ్యాన్స్ అంతా నెట్టింట ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్న అల్లు అర్జున్.. బాలీవుడ్ లో కూడా రూ. 100 కోట్ల గ్రాస్ అందుకొని సాలిడ్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. దీంతో అల్లు అర్జున్ తో సినిమా చేసేందుకు బాలీవుడ్ డైరెక్టర్స్ సైతం ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు బన్నీ పుష్ప 2తో బిజీగా ఉన్నాడు. సో.. చూడాలి మరి రోహిత్ శెట్టి త్వరలో ఏదైనా గుడ్ న్యూస్ చెబుతాడేమో!
Veteran Bollywood Director #RohitShetty said, He would love to work with #Ajith, #ThalapathyVijay, #AlluArjun and #Karthi.
He also shares his dream idea to bring @RanveerOfficial and #ThalapathyVijay together in a film 🔥❤️🤩👌🏻
— KARTHIK DP (@dp_karthik) December 3, 2022