ఇండస్ట్రీలో ఒక దర్శకుడి సినిమాను, పనితీరును మరో దర్శకుడు ప్రశంసించడం అనేది ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఒకవేళ ఆ ప్రశంస పాన్ ఇండియా ఫేమ్ ఉన్న డైరెక్టర్ నుండి వస్తే.. ప్రశంసలు అందుకున్న డైరెక్టర్ ఆనందానికి హద్దులు ఉండవనే చెప్పాలి. ఇటీవలే పాన్ ఇండియా డైరెక్టర్ నుండి ప్రశంసలు అందుకున్నాడు మలయాళం డైరెక్టర్ జీతూ జోసెఫ్. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి జీతూ జోసెఫ్ గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
ఇంతకీ జీతూ జోసెఫ్ తీసిన సినిమాలేంటి? జీతూని ప్రశంసించిన ఆ పాన్ ఇండియా డైరెక్టర్ ఎవరు? అనే సందేహాలు మీకు రావచ్చు. ఆ వివరాల్లోకి వెళ్తే.. మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన దృశ్యం, దృశ్యం 2 సినిమాలను తెరకెక్కించింది జీతూనే. తెలుగులో కూడా ఈ రెండు సినిమాలను జీతూనే డైరెక్ట్ చేయడం విశేషం. అదీగాక రెండు సినిమాలు ఓటిటిలో రిలీజ్ అయినప్పటికీ ప్రేక్షకాదరణ మాత్రం పీక్స్ లో సంపాదించుకుంది దృశ్యం ఫ్రాంచైజ్.
మరి దృశ్యం సిరీస్ తో ప్రేక్షకులను థ్రిల్ కి గురిచేసిన దర్శకుడు జీతూ జోసెఫ్ ని ప్రశంసించిన దర్శకుడు ఎవరో కాదు.. దర్శకధీరుడు రాజమౌళి. బాహుబలి, ట్రిపుల్ ఆర్ సినిమాలతో రాజమౌళి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద పాన్ ఇండియా డైరెక్టర్ గా ఎదిగాడు. అలాంటి రాజమౌళి జీతూ జోసెఫ్ రైటింగ్, డైరెక్షన్ లతో పాటు అన్నివిధాలా అతని వర్క్ కి ఫ్యాన్ అయిపోయానని చెప్పడం మరో విశేషం. ఇక రాజమౌళి లాంటి దర్శకుడు ప్రశంసిస్తే జీతూ ఊరుకుంటాడా? వెంటనే రాజమౌళి గారి కంప్లిమెంట్స్ గొప్పవిగా చెప్పుకొచ్చాడు.
ఇక రాజమౌళి జీతూని ప్రశంసించే క్రమంలో తన మనసులోని కోరికను బయట పెట్టాడనే చెప్పాలి. ‘నాకు దృశ్యం ఫ్రాంచైజ్ ని డైరెక్ట్ చేయాలని ఉంది. ఇంటెలిజెన్స్, ఎమోషన్స్, సింప్లిసిటీ, థ్రిల్ కలగలిపిన జీతూ రైటింగ్ టెర్రిఫిక్ గా అనిపించింది. ఇలాంటి పర్ఫెక్ట్ రైటింగ్ ప్రేక్షకులకు అద్భుతమైన థ్రిల్లింగ్ ఫీల్ కలిగిస్తుంది” అని రాజమౌళి దృశ్యం ఫ్రాంచైజ్ గురించి చెప్పినట్లు సమాచారం.
ఈ లెక్కన రాజమౌళి మనసులో దృశ్యం ఫ్రాంచైజ్ డైరెక్ట్ చేయాలని ఉందని అన్నాడంటే.. దృశ్యం 3 కూడా ఉందని, దానిని డైరెక్ట్ చేయడానికే రాజమౌళి ఇష్టపడుతున్నాడని సినీవర్గాలు చెబుతున్నాయి. మరి థ్రిల్లర్ మూవీస్ లో స్పెషలిస్ట్ అనిపించుకున్న జీతూ జోసెఫ్ త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ ఇస్తాడేమోనని నెట్టింట అభిప్రాయాలను వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా.. రాజమౌళి త్వరలోనే మహేష్ బాబుతో పాన్ ఇండియా మూవీ చేయనున్న విషయం తెలిసిందే. మరి పాన్ ఇండియా మూవీస్ తెరకెక్కించే రాజమౌళి.. దృశ్యం ఫ్రాంచైజ్ గురించి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.