ఇండియన్ సినిమాను ప్రపంచస్థాయిలో ఎస్టాబ్లిష్ చేసిన దర్శకులలో ఎస్ఎస్ రాజమౌళి ఒకరు. అయన తెరకెక్కించిన బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాలు సాధించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ఏడాది విడుదలైన ఆర్ఆర్ఆర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 1200 కోట్ల పైచిలుకు వసూల్ చేసిన రికార్డు సృష్టించింది. పీరియాడిక్ మల్టీస్టారర్ గా పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఆర్ఆర్ఆర్ మూవీలో స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇక థియేటర్స్ తో పాటు ఓటిటి ప్లాట్ ఫామ్స్ లో కూడా ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది.
ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ సినిమాను చూసిన ఇండియన్ ఫ్యాన్స్ తో పాటు హాలీవుడ్ ప్రముఖులు, దర్శక దిగ్గజాలు, ఆడియెన్స్.. ఇలా అందరం సినిమాను ప్రశంసించి రాజమౌళి విజన్ ని కొనియాడారు. అలాగే ఈ ఏడాది ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్ పోటీలో నిలవడం ఖాయమని అభిప్రాయాలు కూడా వెలిబుచ్చారు. కానీ.. రీసెంట్ గా ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(FFI) ఆర్ఆర్ఆర్ ని పక్కనపెట్టి, గుజరాతీ ‘చెల్లో షో’ మూవీని ఆస్కార్ కి నామినేట్ చేశారు. దీంతో ఆర్ఆర్ఆర్ మూవీని ఎందుకు నామినేట్ చేయలేదని ఒక్కసారిగా ఫ్యాన్స్, ప్రముఖుల నుండి విమర్శలు వెల్లువెత్తాయి. అయితే.. ఆర్ఆర్ఆర్ ని హాలీవుడ్ లో రిలీజ్ చేసిన వేరియన్స్ ఫిలిమ్స్ సంస్థ.. సినిమాను ఓసారి చూడాలని ఆస్కార్ అకాడమీని కోరడం జరిగింది.
ఈ నేపథ్యంలో అకాడమీ వారు ఆర్ఆర్ఆర్ చూస్తే.. ఏదొక విభాగంలో ఓటింగ్స్ వచ్చి అవార్డు కొట్టే అవకాశం ఉందని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఆర్ఆర్ఆర్ మూవీని ప్రపంచదేశాలు కొనియాడుతుండగా, బ్రిటన్ కి చెందిన కొందరు సినిమాలో బ్రిటిషర్స్ ని తక్కువ చేసి చూపించారని కామెంట్స్ చేశారు. దీంతో ఆ కామెంట్స్ పై స్పందించిన రాజమౌళి.. బ్రిటిషర్ ని విలన్ పాత్రలో చూపించినంత మాత్రాన బ్రిటిషర్స్ అందరూ విలన్స్ అయిపోరని, ఒకవేళ అందరూ అలాగే అనుకొని ఉంటే బ్రిటన్ లో ఆర్ఆర్ఆర్ ఇంతటి భారీ విజయం సాధించేది కాదని తెలిపారు. అలాగే సినిమాను సినిమాలాగే చూస్తే బాగుంటుందని తన మాటల్లో చెప్పకనే చెప్పారు.
రాజమౌళి ఇంకా మాట్లాడుతూ.. “ఆర్ఆర్ఆర్ సినిమా స్టార్ట్ అవ్వడానికి ముందు వచ్చే డిస్క్లైమర్ అందరు చూసే ఉంటారు. ఒకవేళ చూడకపోయినా పర్వాలేదు. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ అనేది ఓ సినిమా కథ మాత్రమే.. పాఠం కాదు. ఈ విషయం సినిమాలో నటించిన నటీనటులందరికీ తెలుసు. సినిమా చూసిన ప్రేక్షకులకు కూడా విషయం అర్థమై ఉంటుంది. అయితే.. ఓ స్టోరీ టెల్లర్ గా ఈ విషయాలన్నీ అవగాహన ఉంటే.. వేరే విషయాల గురించి ఆలోచన చేసే అవసరం లేదు” అంటూ విమర్శలపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు రాజమౌళి. ప్రస్తుతం రాజమౌళి మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఆర్ఆర్ఆర్ కి ఏదొక విభాగంలో ఆస్కార్ రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి ఆర్ఆర్ఆర్ మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
#RRRMovie still can enter Oscar Race in General Categories. Let’s hope for the Best.#RRRForOscars pic.twitter.com/Tlh2eW4J5e
— Thyview (@Thyview) September 20, 2022