సినీ ఇండస్ట్రీ అన్నాక హీరోహీరోయిన్ల దగ్గరనుండి దర్శకుల వరకు కెరీర్ పరంగా ఏదొక సందర్భంలో చేదు అనుభవాలు, అవమానాలు ఎదురవుతూనే ఉంటాయి. ముఖ్యంగా ఇండస్ట్రీలో మహళల విషయంలో ఎన్నో జరుగుతుంటాయి. అలాంటి ఇబ్బందికరమైన సంఘటనలు ఆ టైంలో ముగుస్తాయేమో కానీ, జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి. ఇక సరైన సమయం వచ్చినప్పుడు లైఫ్ లో ఫేస్ చేసిన చేదు అనుభవాలను బయట పెడుతుంటారు. తాజాగా అలా మొదలైంది, కళ్యాణ వైభోగమే, ఓ బేబీ సినిమాలు తెరకెక్కించిన లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి తన లైఫ్ లో ఎదుర్కొన్న అవమానకర సంఘటనను ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
ఇండస్ట్రీలో లేడీ డైరెక్టర్ ఎప్పుడైనా ఇబ్బందులు ఫేస్ చేశారా? అనే ప్రశ్నకు డైరెక్టర్ నందిని రెడ్డి స్పందిస్తూ.. “చాలాసార్లు ఇబ్బందులు ఎదుర్కొన్నాను. లేడీ అని చిన్నచూపు చూడటం.. లేడీ వచ్చి కమాండింగ్ ఏంటి అన్నట్లు చాలా సందర్భాలలో ఫేస్ చేశాను. అయితే.. నా మూడో సినిమా కళ్యాణ వైభోగమే సినిమా షూటింగ్ టైంలో నన్ను ఓ సీనియర్ ప్రొడక్షన్ ఎక్సిక్యూటివ్ నా గురించి అసభ్యంగా మాట్లాడాడు. నాగశౌర్యతో పబ్ లో ఓ సాంగ్ ప్లాన్ చేసాము.దానికి సంబంధించిన కెమెరా లెన్స్ క్యాన్సల్ చేయించాడు. ఆ సాంగ్ కి ఆ లెన్స్ అవసరమని చెప్పి.. అతనితో చెప్పకుండా నిర్మాతను అడిగి తెప్పించుకున్నాను. ఇక అతనిలో నేను చెప్పకుండా చేస్తున్నాననే ఫీలింగ్ మొదలైంది. సాంగ్ షూట్ చేస్తున్న టైంలో నేను తెప్పించిన కెమెరా లెన్స్ విరిగింది. దానికి ఇరవైవేల వరకు ఖర్చు అవుతుందని తెలుసు.. తర్వాత చూసుకుందాం అని షూటింగ్ కంటిన్యూ చేస్తుండగా.. నా అసిస్టెంట్ ని పిలిచి నా గురించి ఏకవచనంతో ‘అదీ.. ఇదీ.. ఏమనుకుంటోంది అసలు’ అంటూ అసభ్యంగా మాట్లాడాడు.
తర్వాత ఆ విషయం నా దృష్టికి వచ్చింది. వెంటనే నేను నిర్మాతని కలిసి ఆ వ్యక్తి సెట్స్ లో ఉంటే సినిమా చేయను.. వెళ్ళిపోతాను అని చెప్పాను. ఆయన సీనియర్.. యూనియన్ కాంటాక్ట్స్ ఉన్నాయి.. ప్రాబ్లెమ్ అవుతుంది అని నిర్మాత అన్నారు. అవన్నీ నాకు అనవసరం సర్.. అతనుంటే నేను సినిమా చేయను అని గట్టిగా చెప్పేశాను. ఆ తర్వాత ఆ వ్యక్తిని సినిమా నుండి తప్పించారు. కొన్ని రోజుల తర్వాత అతను మళ్లీ షూటింగ్ ప్లేస్ లో కనిపించాడు.నేను వెంటనే షూటింగ్ నుంచి వెళ్ళిపోతున్నట్లు నిర్మాతకు సమాచారం ఇవ్వండని అక్కడున్నవాళ్లకు చెప్పాను. నాకు నిర్మాత నుంచి ఫోన్ వచ్చింది. ఆ సో అండ్ సో పర్సన్ సెట్స్ లో ఉంటే నేను సెట్స్ లోకి రానని నిర్మాతకు సీరియస్ గా చెప్పాను. నేను బూతు మాట మాట్లాడడం అదే ఫస్ట్ టైం. అయితే.. ఆ వ్యక్తి సినిమా షూటింగ్ కోసం రాలేదని.. ఎలక్షన్ క్యాంపేనింగ్ కి వచ్చాడని ప్రొడ్యూసర్ చెప్పారు. అప్పుడు నేను షూటింగ్ కంటిన్యూ చేశాను. ఇది తప్ప నాకు ఇండస్ట్రీలో ఎలాంటి ఇబ్బందులు రాలేదు” అని చెప్పింది. ప్రస్తుతం నందిని రెడ్డి మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి డైరెక్టర్ నందిని రెడ్డి ఫేస్ చేసిన సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.