తెలుగు బుల్లితెరపై వస్తున్న ‘ఢీ’ రియాల్టీ షో పేరు వినగానే మనకు డ్యాన్స్‌షో కన్నా.. ఆది – ప్రదీప్‌ల కామెడీనే గుర్తుకొస్తుంది. ఆ షో అంతగా హిట్ కొట్టిందంటే కారణం వాళ్ల కామెడీ టైమింగ్ అనడంలో సందేహం లేదు. వారి పంచ్‌లు, జోకులు, స్కిట్లు లేకుండా ఆ డ్యాన్స్ షోను ఊహించుకోవడం కష్టమే. ఢీ-14 డాన్సింగ్ ఐకాన్ షో ఎంతో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. ఢీ షోలో కంటెస్టెంట్స్ వేసే డాన్సులు ఒక ఎత్తు అయితే.. జడ్జెస్ ప్రియమణి, నందితా శ్వేత, జానీ మాస్టర్, హైపర్ ఆదీ, యాంకర్ ప్రదీప్ వీళ్ల మధ్య నడిచే ట్రాకులు ఓ రేంజ్ లో ఉంటాయి. అయితే తాజాగా రిలీజ్ అయిన ఢీ-14 ప్రోమో అందరిని ఆకట్టుకుంది. ఇందులో అందిరిపోయే డ్యాన్స్ లతో కంటెస్టంట్ లు దుమ్మురేపారు. అయితే చివర్లో జానీ మాస్టార్ చాలా సీరియస్ అయి జడ్జీ సీట్లో నుంచి లేచి వెళ్లిపోయారు.
తాజాగా ఢీ-14 కి సంబంధించి విడుదులైన ఈ ప్రోమో లో రష్యన్ భామతో ఆది చేసిన కామెడీ కడుపుబ్బా నవ్విస్తుంది. అంతేకాదు.. పుష్ప సినిమాలో “ఊ అంటావా మామా.. ఊ ఊ అంటావా మావా” అనే పాటకి రష్యాన్ బ్యూటీ చేసిన డ్యాన్స్ అదుర్స్ అనిపించింది. అంతకు ముందు ఆది ఆమెతో ఈ పాట పాడించేందుకు నానా తంటాలు పడ్డాడు. ఇక డ్యాన్స్ షోలో అందరూ నువ్వా.. నేనా! అనే విధంగా పోటీ పడ్డారు. ఇక ‘వందే మాతరం.. మనదే ఈ తరం’ అనే పాటకి డ్యాన్స్ అదరగొట్టారు.. జడ్జీలు సైతం లేచి సెల్యూట్ చేశారు.
అప్పటి వరకు అందరినీ ఎంకరేజ్ చేసిన జానీ మాస్టర్ సీరియస్ అయ్యారు. ” ఢీ షో అనేది చాలా పవర్ ఫుల్.. చాలా సీరియస్ గా చెబుతున్నా.. పర్ఫామెన్స్ బాగాలేదు, కొరియోగ్రఫీ బాగాలేదు.. అసలు ఏదీ బాగాలేదు” అంటూ జడ్జీ సీట్ నుంచి జానీ మాస్టార్ లేచి వెళ్లిపోయారు. దాంతో అక్కడ వాతావరణం ఒక్కసారే సీరియస్ మోడ్ లోకి వెళ్లి పోయింది. మరి అసలు ఢీ షోలో ఏం జరిగింది అనేది తెలియాలంటే ఈ వారం లైవ్ చూడాల్సిందే. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.