మాస్ మహారాజా రవితేజ.. సినిమాలో ఉన్నాడంటే ఎంటర్ టైన్ మెంట్ గ్యారంటీ. డైరెక్టర్స్ కూడా అందుకు తగ్గట్లే మూవీని తీస్తుంటారు. ఇక ఈ ఏడాది ‘ఖిలాడీ’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రాలతో వచ్చినప్పటికీ.. బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచాడు. ఇక ఈ ఏడాది మూడో ప్రయత్నంగా ‘ధమాకా’తో వచ్చాడు. కామెడీ ఎంటర్ టైనరగా తీసిన ఈ సినిమా తాజాగా థియేటర్లలోకి వచ్చింది. రవితేజ ఫ్యాన్స్ తోపాటు మాస్ ఆడియెన్స్ ని అలరిస్తోంది. తొలిరోజు కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో వచ్చాయి.
ఇక విషయానికొస్తే.. రవితేజకు సరైన హిట్ చాలా కాలమైపోయింది. అప్పుడెప్పుడో ‘రాజా ది గ్రేట్’, గతేడాది వచ్చిన ‘క్రాక్’ మాత్రమే అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించాయి. మిగతా సినిమాలు వచ్చినవి వచ్చినట్లే వెళ్లిపోయాయి. ఇక రవితేజ హీరోగా నటించిన ‘ధమాకా’కు కూడా పెద్దగా పాజిటివ్ రెస్పాన్స్ ఏం రాలేదు. కానీ ఫస్ట్ డే కలెక్షన్స్ మాత్రం గట్టిగానే వచ్చాయి. సినిమాపై హైప్, హీరోయిన్ శ్రీలీల, రెండు మూడు సాంగ్స్ దీనికి కారణమని తెలుస్తోంది. ఏదైతేనేం సినిమా టాక్ ఎలా ఉన్నప్పటికీ వసూళ్లు మాత్రం గట్టిగానే వచ్చాయి.
చిత్రబృందం తొలిరోజు కలెక్షన్స్ కు సంబంధించిన పోస్టర్ ని కూడా తాజాగా రిలీజ్ చేసింది. ఇందులో భాగంగా వరల్డ్ వైడ్ ఫస్ట్ డే రూ.10 కోట్ల గ్రాస్ సాధించినట్లు పేర్కొన్నారు. ఈ వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ నంబర్ ఇంకా పెరిగేలా కనిపిస్తుంది. ఈ వారం రిలీజైన లాఠీ, 18 పేజెస్, కనెక్ట్ సినిమాల కంటే ‘ధమాకా’కే ప్రేక్షకులు ఓటేసే ఛాన్సులు గట్టిగా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా రవితేజ ప్రత్యేక పాత్రలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించిన ‘వాల్తేరు వీరయ్య’.. ఈ సంక్రాంతికే థియేటర్లలోకి రానుంది. అంటే వారాల వ్యవధిలోనే రవితేజ, తన ఫ్యాన్స్ ఎంటర్ టైన్ చేసేందుకు సిద్ధమైపోయాడు. మరి ‘ధమాకా’ ఫస్ట్ డే కలెక్షన్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
MassMaharaja @RaviTeja_offl ‘s
MASSive Box Office Rampage 💥#DhamakaBlockBuster in Cinemas Now 🥳🤩#DhamakaBook your tickets nowhttps://t.co/iZ40p9utmY#DhamakaFromDec23@sreeleela14 @TrinadharaoNak1 @vishwaprasadtg @vivekkuchibotla @KumarBezwada pic.twitter.com/pr8bQO2z2R
— People Media Factory (@peoplemediafcy) December 24, 2022