గ్లామర్ ఫీల్డ్ లో ఎవరు సెలబ్రిటీ హోదా సంపాదించుకున్నా.. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండటం జరుగుతుంటుంది. సినీ తారలైనా, టీవీ నటులు, యాంకర్స్ కాకుండా.. సోషల్ మీడియా ద్వారా క్రేజ్ దక్కించుకున్నవారు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వెలుగులోకి వచ్చారు. అలాంటి వారిలో బిగ్ బాస్ బ్యూటీ దీప్తి సునైనా ఒకరు. దీప్తి గురించి సోషల్ మీడియా యూజర్లకు, బిగ్ బాస్ ఫ్యాన్స్ కి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. డబ్ స్మాష్ వీడియోలు, టిక్ టాక్, ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ వీడియోలతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న దీప్తి.. బిగ్ బాస్ లోకి వెళ్ళాక టీవీ ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరైంది.
ఇక బిగ్ బాస్ తో క్రేజ్ అయితే పెంచుకుంది.. కానీ, షణ్ముఖ్ జస్వంత్ తో లవ్ బ్రేకప్ చేసుకొని వార్తల్లో నిలిచింది. అప్పటినుండి ఎవరికివారే కెరీర్ లో బిజీ అవుతున్నారు. దీప్తి రెగ్యులర్ గా యూట్యూబ్ లో సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ.. ఇన్ స్టాగ్రామ్ రీల్స్, ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. ఇటీవలే కొత్త ఇంటి గృహప్రవేశం చేసి గుడ్ న్యూస్ చెప్పిన ఈ భామ.. తాజాగా హాట్ వీడియో ఒకటి ఇన్ స్టాలో పోస్ట్ చేసి సర్ప్రైజ్ చేసింది. ఆ వీడియో చూస్తే.. సర్ప్రైజ్ అనడం కంటే.. ఫ్యాన్స్ పండగ చేసుకోవచ్చని చెప్పడం మంచిదేమో. థండర్ థైస్ షో చేసి ఆ రేంజ్ లో రెచ్చిపోయింది దీప్తి. ప్రస్తుతం దీప్తి హాట్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ఓవైపు యూట్యూబ్ వీడియోలు చేస్తూ.. హాట్ హాట్ ఫోటోషూట్స్ తో ఊరిస్తున్న దీప్తిని ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడు బిగ్ స్క్రీన్ పై చూస్తామా అని వెయిట్ చేస్తున్నారు. కానీ, ఇప్పటివరకు సినిమాలు, కెరీర్ గురించి నోరు విప్పలేదు దీప్తి. మరోవైపు స్టార్ హీరోయిన్స్ తో సమానమైన సోషల్ మీడియా ఫాలోయింగ్ మెయింటైన్ చేస్తోంది. అదీగాక స్టార్ హీరోయిన్స్ తో పోటీపడే స్థాయి ఫిగర్ కూడా ఉందని ఫోటోషూట్స్, రీల్స్ తో ప్రూవ్ చేసుకుంటోంది. మరి తాజాగా థండర్ థైస్ చూపిస్తూ దీప్తి పోస్ట్ చేసిన వీడియో చూసి.. ఫ్యాన్స్, నెటిజన్స్ మనసు పారేసుకుంటున్నారు. చూసినవాళ్లు ఊరికే ఉంటారా! దీప్తి అందాలను పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు. మరి దీప్తి గ్లామరస్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.