Deepika Padukone: స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె గురించి పరిచయం అవసరం లేదు. ఈ సౌత్ బ్యూటీకి బాలీవుడ్ లో ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంది. అయితే.. తాజాగా దీపికా పదుకొనెకి అస్వస్థతకి గురైనట్టు తెలుస్తోంది. దీపికా ప్రస్తుతం సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ లోనే ఉంది. ఆ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న సమయంలోనే దీపికా పదుకొనె అస్వస్థతకి గురై, ఆసుపత్రిలో చేరినట్టు సమాచారం. ఎల్బీనగర్‌లోని కామినేని ఆసుపత్రిలో దీపికాకి ప్రాథమికంగా చికిత్స అందించినట్టు వార్తలు వస్తున్నాయి.
అనంతరం దీపికా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి నోవాటెల్‌లో రెస్ట్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే.. ఈ విషయంలో పీఆర్ టీమ్ వివరణ మరోలా ఉంది. దీపికా పదుకొనె అస్వస్థత వార్తల్లో నిజం లేదు. కేవలం జనరల్ చెకప్ కోసం మాత్రమే దీపిక ఆసుపత్రికి వెళ్ళింది.రిపోర్ట్ లు అన్ని వచ్చాక, ఆమె యధావిధిగా షూటింగ్‌లో పాల్గొంటున్నట్టు తెలిపారు. ఈ విషయంలో అభిమానులు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని దీపిక పీఆర్ టీమ్ వివరణ ఇచ్చింది.
ప్రస్తుతం దీపికా పదుకొనె ప్రభాస్‌తో `ప్రాజెక్ట్ కే` చిత్రంలో నటిస్తుంది. మొత్తం 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ పాన్ వరల్డ్ మూవీ తెరక్కిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతోపాటు హిందీలో పలు ప్రాజెక్ట్ ల్లో బిజీగా ఉంది దీపికా. షారూఖ్ ఖాన్‌తో `పఠాన్` చిత్రంలో నటిస్తుంది. అలాగే హృతిక్ రోషన్‌తో `ఫైటర్` సినిమా చేస్తుంది. ఇప్పుడు `ఫైటర్` సినిమా షూటింగ్‌లోనే దీపికాకి గాయమైందన్న టాక్ వినిపిస్తోంది, మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రుపంలో తెలియజేయండి.
Official Sources:
Deepika Padukone has gone to the hospital three days ago for General Checkup. Everything is good and she is fine. She is participating in the #ProjectK shoot today.
— MIRCHI9 (@Mirchi9) June 14, 2022