చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ హాస్యనటుడు ఉల్లాస్ భార్య ఇంట్లో ఊరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే తన భార్య కనిపించట్లేదని.. సదరు కమెడియన్ అంతకు ముందే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనే అతడి నివాసానికి వెళ్లిన పోలీసులకు, ఆమె ఫ్యాన్ కు ఉరి వేసుకుని కనిపించింది. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అలానే ఈ కేసుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. మలయాళంలో ఉల్లాస్ పండళం ప్రముఖ హాస్యనటుడు. టీవీ షోల్లో స్టేజీ ఫెర్ఫామెన్స్ తో ఫేమస్ అయిన ఇతడు.. మెగాస్టార్ మమ్ముట్టి నటించిన ‘దైవతింటే సొంతం క్లీటస్’ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక దీని తర్వాత ‘ఇతు తాండ పోలీసు’, కాముకి, మన్నార్ మత్తై స్పీకింగ్ 2, హాస్యం లాంటి సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక 2020లో కొత్తింట్లోకి మారిన ఇతడు.. ఓవైపు సినిమాలు చేస్తూ మరోవైపు షోలు చేసుకుంటా కెరీర్ పరంగా బాగానే ఉన్నాడు. తాజాగా అతడి భార్య ఊరేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఆమె చనిపోయే ముందురోజు.. మొదటి అంతస్తులో పిల్లలతో కలిసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే మంగళవారం రాత్రి ఆమె కనిపించకపోయేసరికి ఉల్లాస్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. తీరా పోలీసులు వచ్చి చూస్తే.. ఆమె ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది.
ഭാര്യയുടെ മരണസമയത്ത് ഉല്ലാസ് വീട്ടിലുണ്ടായിരുന്നു ? | Ullas Pandalam https://t.co/2btUA8tf05 via @YouTube pic.twitter.com/X2kI3E6sGJ
— desha sangam (@SangamDesha) December 20, 2022