మనకి ఎప్పుడో పరిచయమున్న వ్యక్తుల ఫొటోస్ ని చూపించి ఫొటోలో ఉన్న వాళ్ళని గుర్తుపట్టండి అంటే గుర్తుపట్టలేకపోవచ్చు.. కానీ సినిమా హీరోయిన్ ల ఫొటోస్ ని చూపించి గుర్తుపట్టండి అంటే టక్కున గుర్తుపడతాం.
మనకి ఎప్పుడో పరిచయమున్న వ్యక్తుల ఫొటోస్ ని చూపించి ఫొటోలో ఉన్న వాళ్ళని గుర్తుపట్టండి అంటే గుర్తుపట్టలేకపోవచ్చు.. కానీ సినిమా హీరోయిన్ ల ఫొటోస్ ని చూపించి గుర్తుపట్టండి అంటే టక్కున గుర్తుపడతాం. పై ఫొటోలో ఉన్న లేడీ ఒకప్పటి టాప్ హీరోయిన్. కేవలం ఒకే ఒక్క సినిమా తో దక్షిణ భారత దేశం మొత్తం తన వైపు చూసేలా చేసింది. అలాగే పెళ్లి గాని కుర్రకారు మొత్తానికి ఆ సినిమా తో కలల రాకుమారి గా మారింది ..ఏంటండీ తనెవరో ఇంకా మీకు గుర్తుకు రాలేదా? తను సినిమా హీరోయిన్ అండి ? సినిమా హీరోయిన్ అయినా గుర్తుకురాలేదంటరా ? అయితే తనకి సంబంధించిన ఇంకొంత మ్యాటర్ ని మీ ముందు ఉంచుతా. మీరే గుర్తుపడతారు
1989వ సంవత్సరం లో రిలీజ్ అయ్యి సరికొత్త రికార్డు ల చరిత్ర సృష్టించిన సినిమా లో తను హీరొయిన్ . హీరోయిన్ మాత్రమే కాదండోయ్ ఆ సినిమా ఘన విజయం లో కూడా తను మెయిన్ కారణం. నేటి టాలీ వుడ్ అగ్ర కధానాయకుడు ఆ సినిమా లో హీరో. అలాగే ఇండియన్ సినిమా గర్వించదగ్గ గొప్ప దర్శకుడు ఆ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఇంకా తనెవరో గుర్తుకురాలేదా? ఓకె.. ఆ సినిమాకి సంగీతం వహించింది కూడా భారతదేశం గర్వించదగ్గ ఒక గొప్ప సంగీత దర్శకుడు. ఆ మూవీ లో ని పాటలన్ని సూపర్ డూపర్ హిట్. నేటికీ చాలా చోట్ల ఆ పాటలు వినిపిస్తూనే ఉంటాయి. పై ఫొటోలో ఉన్న లేడీ ఆ మూవీ లో ని ఒక వానపాటలో సూపర్ గా డాన్స్ కూడా చేసింది. ఇంకా మీకు గుర్తుకు రాలేదా ? ఇంక లాభం లేదు .అసలైన క్లూ ఇస్తే గాని మీకు అర్ధం కాదు. ఆ సినిమా లో తాను చెప్పిన ఒక డైలాగ్ అప్పట్లో దక్షిణ భారతదేశం మొత్తాన్ని ఒక ఊపు ఊపింది. ఆ డైలాగ్ ఏంటంటే లేచిపోదామా..ఇప్పుడు తనెవరో మీకు అర్ధం అయ్యింది కదు. యస్ తను గిరిజ. గీతాంజలి మూవీ ద్వారా మీ అందర్నీఎంతగానో తన నటనతో అలరించిన గిరిజ.
యువసామ్రాట్ అక్ఖినేని నాగార్జున హీరోగా గిరిజ హీరోయిన్ గా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన సినిమా గీతాంజలి .మణిరత్నం డైరెక్టుగా తెలుగు భాషలో దర్శకతం వహించిన మొదటి సినిమా కూడా ఇదే. తన పాత్ర పేరే సినిమా టైటిల్ గా తెరకెక్కిన ఈ మూవీ లో గిరిజ తన అమాయకపు నటనతో లక్షలాది మంది అభిమానులని సంపాదించుకుంది. ఆ రోజుల్లో యూత్ అందరూ కాలేజ్ ల కి డుమ్మా కొట్టి మరి గీతాంజలి సినిమా కి వెళ్ళేవాళ్ళు. సాధారణం గా స్టూడెంట్స్ అండ్ టీచర్స్ కాలేజీ లో గుడ్ మార్నింగ్ చెప్పుకుంటారు. కానీ గీతాంజలి మూవీ ఆడే థియేటర్స్ దగ్గర గుడ్ మార్నింగ్ లు చెప్పుకునే వాళ్లంటే గీతాంజలి మూవీ ప్రభంజనాన్ని అర్థం చేసుకోవచ్చు. గీతాంజలి టైటిల్ రోల్ లో తాను చావుకి దగ్గర అవుతున్నానని తెలిసి కూడా నాగార్జునతో నిన్ను ప్రేమిస్తున్నానని ఆట పట్టించే అమ్మాయి గా ఆ తర్వాత నాగార్జునని నిజంగా ప్రేమించే అమ్మాయిగా గిరిజ చేసిన అల్లరిని ,ప్రేమని నేటికీ ఎవరు మర్చిపోలేరు. సినిమా లో గిరిజ చూసే ఒర చూపుల నుంచి తప్పించుకున్న యూత్ లేదు. యూత్ అంత గిరిజ కి దాసోహం అయ్యారు.
ఆ సినిమాలో నాగార్జునతో తాను చెప్పే.. లేచిపోదామా అనే డైలాగ్ కి అయితే థియేటర్స్ మొత్తం విజిల్స్ తో మారుమోగిపోయేవి.ఆ సినిమా తర్వాత గిరిజ వివాహం చేసుకొని సినిమాలకి దూరం అయ్యింది. మళ్ళీ ఇప్పుడు సుమారు ముప్పయి సంవత్సరాల తర్వాత గిరిజ తన సొంత బాష అయిన ఇబ్బని తబ్బిది ఇలియాలి అనే కన్నడ మూవీ ద్వారా చిత్ర రంగ ప్రవేశం చేస్తుంది. ఈ వార్త విన్న గిరిజ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. కాగా గిరిజ పూర్తి పేరు గిరిజ షెట్టర్.తన తండ్రి కన్నడిగుడు. తల్లి బ్రిటిష్ దేశస్థురాలు.
ರಕ್ಷಿತ್ ಶೆಟ್ಟಿಯ ‘ಇಬ್ಬನಿ ತಬ್ಬಿದ ಇಳೆಯಲಿ’ ತಂಡಕ್ಕೆ ತೆಲುಗು ನಟಿ ಗಿರಿಜಾ ಶೆಟ್ಟರ್ ಎಂಟ್ರಿ https://t.co/MpNunc1Gfv #ibbanitabbidaileyali #GirijaShettar #Rakshitshetty @rakshitshetty @ParamvahStudios @GirijaShettar
— ETV Bharat Karnataka (@ETVBharatKA) August 12, 2023