యంగ్ మెగా హీరోతో బొమ్మరిల్లు భాస్కర్ ఓ సినిమా చేయనున్నాడా అంటే ఫిల్మ్ నగర్ లో అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. భాస్కర్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అఖిల్ అక్కినేని హీరోగా తెరకెక్కించిన తాజా చిత్రం మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’. దసరా కానుకగా విడుదలైన ఈ సినిమా మంచి హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ మూవీ విజయం సాధించటంతో దర్శకుడు భాస్కర్ కి కూడా చాలా రోజుల తర్వాత మంచి హిట్ దొరికిందనే చెప్పాలి.
దీంతో గీతా ఆర్ట్స్ సంస్థ బొమ్మరిల్లు భాస్కర్ కి మరో అవకాశం ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే భాస్కర్ తెరకెక్కించబోయే ఈ సినిమాలో మెగా యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ ని హీరోగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీని మంచి ఫ్యామిలీ గుడ్ సినిమాగా తెరకెక్కించనున్నాడట భాస్కర్. అయితే దీనికి సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ బిజీగా ఉన్నట్లు సమాచారం. మరి ఇంతకి వైష్ణవ్ తేజ్ ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా? మరి నిజంగానే వీరిద్దరి క్రేజీ కాంబినేషన్ లో సినిమా రాబోతుందా అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.