సోషల్ మీడియాలో ట్రోలింగ్ అనేది ఈరోజుల్లో సర్వసాధారణం అయిపోయింది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలపై ట్రోల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా సోషల్ మీడియాలో ఓ నెటిజన్ చేసిన కామెంట్ కి హీరోయిన్ నందితా శ్వేత కాస్త ఘాటుగానే స్పందించింది. హీరోయిన్స్ అన్నాక సోషల్ మీడియా ఖాతాలలో కొత్త కొత్త ఫోటోలు పోస్ట్ చేస్తారనే సంగతి తెలిసిందే.
ఇక హీరోయిన్స్ పెట్టే ఫోటోలపై ఎల్లప్పుడూ అభిమానులు, నెటిజన్లు ఓ కన్నేసి ఉంచుతారు. అలాగే హీరోయిన్ ఓ గ్లామరస్ ఫోటో పెట్టిందంటే చూస్తూ కళ్లప్పగిస్తారు. అదే హీరోయిన్ కాస్త లావుగా కనిపించేసరికి.. మీరు కొంచెం డైట్ చేస్తే బెటర్.. నాజూకుదనం పోతుందని అంటుంటారు. తాజాగా ఓ నెటిజన్ నందితా పై బాడీ షేమింగ్ కామెంట్స్ చేశాడు.‘ప్లీజ్ మీరు శరీరంపై శ్రద్ధ పెట్టండి. మీ షేప్స్ చూసుకోండి ఓసారి. ఆంటీలా కనిపిస్తున్నావ్. కాస్త వర్కౌట్స్ చెయ్’ అంటూ కామెంట్ చేశాడు. సదరు నెటిజన్ చేసిన కామెంట్ స్క్రీన్ షాట్ పోస్ట్ చేసి.. ‘ఇలాంటి మనుషులు కూడా ఉంటారా? నేనేం దేవతను కాదు. నేను ఓ సామాన్య మనిషినే. అందరిలానే నాకు కూడా బాధలు ఉంటాయి. ఇలాంటి మాటలు ఎలా మాట్లాడతారు.. నా శరీరాన్ని ఎలా ఉన్నా నేను ప్రేమిస్తాను. ప్రస్తుతం నేనున్న విధానాన్ని చాలా ఇష్టపడుతున్నాను’ అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. నెట్టింట నందితా పోస్ట్ వైరల్ అవుతోంది. మరి నందితా పోస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.