సినిమా తీసే దగ్గర నుంచి దాన్ని థియేటర్ లేదా ఓటీటీలో రిలీజ్ చేసే వరకు చాలా ప్రయాస ఉంటుంది. అందుకు తగ్గట్లే దర్శక-నిర్మాతలు చాలాకష్టపడతారు. ఈ క్రమంలోనే కొన్నిసార్లు మనోభావాలు విషయంలో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలా తెలుగులోనూ పలువురు నటీనటుల దగ్గర నుంచి దర్శకుల వరకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన సందర్భాలు అనేకం. కొన్నిసార్లు జైలు-కోర్టు వరకు వెళ్లారు. ఇప్పుడు బాలీవుడ్ లో సేమ్ అలాంటి సంఘటనే జరిగింది. ప్రముఖ మహిళా నిర్మాత మరోసారి వివాదంలో చిక్కుకుంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. ‘డర్టీ పిక్చర్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కాస్తోకూస్తో ఈమె గురించి తెలుసు. ఎక్కువగా అడల్ట్ కంటెంట్ ని నిర్మించే ఈమెకు.. బాలాజీ టెలిఫిల్మ్స్ లిమిటెడ్ అనే నిర్మాణ సంస్థతో పాటు ఏఎల్ టీ బాలాజీ అనే ఓటీటీ ప్లాట్ ఫారమ్ కూడా ఉంది. ఇందులో అడల్ట్ కంటెంట్ సిరీసులు, సినిమాలే దాదాపుగా ఉంటాయి. ఇందులో XXX సీజన్ 2 ఈ మధ్య ప్రసారమైంది. ఇందులో కొన్ని సన్నివేశాలు.. సైనికులు, వారి కుటుంబ సభ్యుల మనోభావాలు కించపరిచేలా ఉన్నాయని మాజీ సైనికుడు శంభు కుమార్ ఫిర్యాదు చేశారు.
అయితే ఈ విషయంలో.. డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్ తోపాటు ఆమె తల్లి శోభా కపూర్ పైనే కేసు నమోదైంది. దీంతో వీరిద్దరికీ న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. దీనితో పాటే కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. అయితే ఈ విషయంలో.. ఫిర్యాదు అందిన వెంటనే సిరీసులోని సీన్స్ తొలగించామని సదరు ఓటీటీ సంస్థ పేర్కొంది. కానీ ఆదేశాల ప్రకారం ఏక్తా కపూర్-శోభా కపూర్ మాత్రం కోర్టుకి హాజరు కాలేదు. దీంతో వారిపై అరెస్ట్ వారెంట్ జారీ అయినట్లు బిహార్లోని బెగుసరాయ్ కోర్టు న్యాయవాది మిస్టర్ పాఠక్ తెలిపారు. మరి నిర్మాత ఏక్తా కపూర్ కు అరెస్ట్ వారెంట్ జారీ కావడం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.