Samrat Reddy: బిగ్ బాస్ ద్వారా ఫేమ్ లోకి వచ్చిన వారిలో నటుడు సామ్రాట్ ఒకరు. తాజాగా తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. త్వరలోనే తాను తండ్రి కాబోతున్నానని చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. తన భార్య శ్రీలిఖిత బేబీ బంప్ ఫోటోలు షేర్ చేస్తూ.. పుట్టబోయే బిడ్డకోసం ఎదురుచూస్తున్నాం అని క్యాప్షన్ జోడించాడు. ప్రస్తుతం సామ్రాట్ తన భార్య లిఖిత ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
ఇక ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్, నెటిజన్స్ సామ్రాట్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. బిగ్ బాస్ రెండో సీజన్ లో పాల్గొన్న సామ్రాట్.. బిగ్ బాస్ ఇంట్లో ఉండగానే ఆయన వైవాహిక జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నాడు. అయితే.. సామ్రాట్ కి 2015లోనే హర్షిత రెడ్డి అనే అమ్మాయితో పెళ్లయింది. కానీ.. కొన్ని కారణాల వలన విడిపోయి విడాకులు తీసుకున్నారు.
అనంతరం సామ్రాట్.. గతేడాది కాకినాడకు చెందిన శ్రీ లిఖితను పెళ్లి చేసుకున్నాడు. వీరి పెళ్లికి తన బిగ్ బాస్ ఫ్రెండ్స్ తనీష్, దీప్తి సునయన తదితరులు హాజరై విష్ చేశారు. ఇక ఇప్పుడు సామ్రాట్ తండ్రి కాబోతున్న విషయాన్ని తెలియజేస్తూ ఆనందంలో మునిగి తేలుతున్నాడు. ఇక సామ్రాట్ దంపతులు పేరెంట్స్ కాబోతున్న సంతోషంలో ఫోటోషూట్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.
ఇదిలా ఉండగా.. 20 ఏళ్ళ క్రితమే టాలీవుడ్ లో నటుడిగా అడుగుపెట్టిన సామ్రాట్.. యువకుడు, పంచాక్షరి, అహనా పెళ్ళంట, వైఫ్ ఆఫ్ రామ్, కొంచం ఇష్టం కొంచం కష్టం, దేనికైనా రెడీ లాంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. బిగ్ బాస్ అనంతరం సామ్రాట్ సినిమాలలో పెద్దగా కనిపించలేదు. మరి సామ్రాట్ దంపతులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.