అషు రెడ్డి.. ఈ పేరు తెలియని తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఉండరు. డబ్ స్మాష్ లో జూనియర్ సమంతలా కనిపించి పాపులర్ అయింది ఈ భామ. అనంతరం బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి మంచి క్రేజ్ సంపాదించింది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకి వచ్చిన అనంతరం అనేక షోల్లో యాంకర్ గానూ మెరుస్తోంది ఈ అమ్మడు. గతంలో ఆర్జీవీతో చేసిన బోల్డ్ ఇంటర్యూలో రచ్చ రచ్చ చేసింది. మరొకవైపు సోషల్ మీడియాలోనూ అషు బేబి ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. నిత్యం తనకు సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ కుర్రకారులు చెమటలు పట్టిస్తుంది. తాజాగా మరోసారి తన ఫిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేసి.. అందరినీ అవాక్కయేలే చేసింది. బాత్ టబ్ లో స్నానం చేస్తున్న ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతోన్నాయి.
గతంలో అషు రెడ్డి ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫొటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. మోడ్రన్ డ్రెస్‌లోనే అఘోరా గెటప్‌లో అదరగొట్టింది. ఈ అమ్మడు తన హాట్ ఫోటో షూట్ లతో కుర్రకారులకు సెగలు పుట్టిస్తుంది. తాజాగా స్నానం చేస్తుండగా దిగిన ఫోటోలను నెట్టింట్లో షేర్ చేసింది ఈ భామ. అలా పిక్స్ షేర్ చేయడంతో పాటు .. కొన్ని క్యాప్షన్స్ ను హ్యాష్ ట్యాగ్ రూపంలో పెట్టేసింది. “ఎంతో ఆహ్లాదకరమైన కలలు, షవర్ థాట్స్.. సేవ్ వాటర్” అంటూ ఇలా హ్యాష్ ట్యాగులతో దుమ్ములేపేసింది. మొత్తానికి అషూ రెడ్డి మాత్రం బాత్ టబ్ పిక్స్‌తో నెట్టింట్లో మంటలు పుట్టించేస్తోంది. ఈ క్రమంలో అషు రెడ్డిపై నెట్టిజన్లు ఓ రేంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అషురెడ్డి బాత్ టబ్ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అషు రెడ్డి బోల్డ్ ఫోటోషూట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.