టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాల సందడి మొదలైంది. అఖండ సినిమాతో ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారని భావించిన దర్శకనిర్మాతలు తమ సినిమాల విడుదల తేదీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. చాలాకాలం తర్వాత ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు రిలీజ్ అవుతుండటంతో ప్రేక్షకులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అయితే.. రానున్న 2022 సంక్రాంతి బరిలో తెలుగు నుండి భారీ రిలీజులు ఉన్నాయి. జనవరి 7న రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా మల్టీస్టారర్ RRR, జనవరి 12న పవన్ కళ్యాణ్ భీమ్లానాయక్, జనవరి 14న ప్రభాస్ రాధేశ్యామ్ పాన్ ఇండియా మూవీస్ డేట్స్ ప్రకటించాయి. సంక్రాంతి బరిలో వారం రోజుల వ్యవధిలోనే రెండు పాన్ ఇండియా సినిమాలు ఉండటంతో.. భీమ్లానాయక్ సినిమాని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు నిర్మాతలు.
TILL THEN We shall Keep U Engaged With
Crazy Film Promotions
Songs #BheemlaNayakMusic
&
Teasers & Trailers
guys !!🖤🎵
ITS OUR HEART ❤️ WILL BE ON OUR BEST #BheemlaNayak is a MASSSSSSIVE FILM 🎥
God bless ⭐️ pic.twitter.com/QViL5R0OHY
— thaman S (@MusicThaman) December 21, 2021
రెండు పాన్ ఇండియా సినిమాల మధ్యలో భీమ్లానాయక్ సినిమా రిలీజైతే.. థియేటర్స్ విషయంలో ప్రాబ్లెమ్ ఏర్పడే అవకాశం ఉందని తాజా ప్రెస్ మీట్ లో నిర్మాత దిల్ రాజు అన్నారు. సంక్రాంతి టైంలో జనవరి 12న రిలీజ్ అవ్వాల్సిన భీమ్లానాయక్ తేదీని ఫిబ్రవరి 25కి వాయిదా వేస్తున్నామని.. అలాగే ఫిబ్రవరి 25న రిలీజ్ అవ్వాల్సిన F3 మూవీని ఏప్రిల్ 29కి వాయిదా వేస్తున్నట్లు దిల్ రాజు ప్రెస్ మీట్ లో ప్రకటించారు.
Dil raju thanking @PawanKalyan Garu & producer of #BheemLaNayak for accepting the request of Producers council for the welfare of TFI !! pic.twitter.com/B0Lx6cqZ79
— Ardent PawanKalyan Fans™ (@ArdentPSPKFans) December 21, 2021