ఎట్టకేలకు 2022 సినిమాల సందడి ముగిసిపోయింది. రానున్న 2023 సంవత్సరంలో నూతన ఉత్సాహంతో కొత్త సినిమాలను ఆదరించేందుకు ప్రేక్షకులు కూడా రెడీ అయిపోయారు. 2022.. ఎన్నో సినిమాలు.. ఎన్నో అనుభూతులు.. ఊహించని జయాపజయాలు.. అందులో కొన్ని హృదయాల్ని హత్తుకున్న స్మృతులు.. తరువాయి భాగమంటూ సీక్వెల్స్.. కొత్త కథలు.. కొంగొత్తయిన కాన్సెప్టులు.. కొత్త క్యారెక్టర్స్.. ప్రేక్షకులను మురిపించి మరిపించిన చిన్న సినిమాలు.. బాక్సాఫీస్ లెక్కలు మార్చిన పెద్ద సినిమాలు.. అనుకోని ప్లాపులు.. ఆశానిరాశల మధ్య ఇండియన్ సినిమా స్థాయిని పెంచిన ఇండస్ట్రీలు.. ప్రతి ఇండస్ట్రీలో గుర్తుండిపోయే సినిమాలు.. ఇలా తీపిచేదుల మధ్య బెస్ట్ మూవీస్ గా 20కి పైగా సినిమాలు!
మరి కలెక్షన్స్ పరంగా డివైడ్ చేశారా? ఆదరణ పరంగా విభజించారా? అనంటే.. కలెక్షన్స్ పరంగానే కానీ, కమర్షియల్ వసూళ్లు కాదు, జనాల మనసులను ఎక్కువగా కలెక్ట్ చేసిన సినిమాలు.. జనాలు బాగా మెచ్చిన సినిమాలనే బెస్ట్ మూవీస్ గా డివైడ్ చేయడం జరిగింది. ఆ లెక్కన 2022లో ఉత్తమ సినిమాలుగా.. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళం భాషల నుండి ఒక్కటిగా చేర్చడం జరిగింది. అయితే.. ఇందులో కొన్ని మిస్ అయ్యుండొచ్చు కూడా.. సో.. మాకు తెలిసిన బెస్ట్ మూవీస్ లిస్ట్ ఏంటి? మా లిస్ట్ లో ఉన్నవి మీ లిస్టులో ఉన్నాయా లేదా చూద్దాం!
ఇవేకాకుండా మరికొన్ని సినిమాలు.. 777 చార్లీ, బ్రహ్మాస్త్ర, లైఫ్ ఆఫ్ ముత్తు, విక్రాంత్ రోణ, డీజే టిల్లు, భూల్ భూలయ్య 2, హృదయం, భీష్మ పర్వం కూడా బెస్ట్ మూవీస్ జాబితాలో చేరే అవకాశం ఉంది. మరి వీటిలో మీ ఫేవరేట్ మూవీ ఏది? మా లిస్టులో ఉందా లేదా? కామెంట్స్ లో తెలియజేయండి.