సాయిపల్లివి- రానా జంటగా వేణు ఊడుగుల తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ సినిమా విరాటపర్వం ఎట్టకేలకు విడుదలైంది. జూన్ 17న విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకువెళ్తోంది. నక్సలైట్ బ్యాక్ డ్రాప్ లో వేణు ఊడుగుల తెరకెక్కించిన ఈ లవ్ స్టోరీకి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. సాయి పల్లవి, రానా యాక్టింగ్ సినిమాకే హైలైట్ గా నిలుస్తుంది. సినిమాకి సంబంధించిన నటీనటుల యాక్టింగ్, టెక్నికల్ టీమ్ పనితీరు, సంగీతం, డైరెక్షన్ పరంగా మంచి టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాలో ప్రతి పాత్ర చెప్పే మాట ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటాయి. విరాట పర్వం సినిమా నుంచి.. అలాంటి కొన్ని బెస్ట్ డైలాగ్స్ మీకోసం.