రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల వద్ద పండగ వాతావరణం కనిపిస్తోంది. డప్పుల మోతలు, టపాసుల చప్పుళ్లతో హోరెత్తిపోతోంది. అందుకు కారణం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జనవరి 12న నటసింహం బాలయ్య నటించిన వీర సింహారెడ్డి సినిమా విడుదల జరిగడమే. టాలీవుడ్ లో బాలయ్యకు ఉన్న మాస్ క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. సమయం ఏదైనా, సందర్భం ఏదైనా జైబాలయ్య అంటూ నినాదాలతో ఊగిపోతూ ఉంటారు. అలాంటిది బాలయ్య సినిమా రిలీజ్ అంటే పూనకాలు రావాల్సిందే.
ఏపీ, తెలంగాణలో థియేటర్ల వద్ద పరిస్థితి అలాగే ఉంది. అయితే తిరుపతిలో మాత్రం ఓ వింత ఘటన చోటుచేసుకుంది. తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ ఉంటే పూలమాలలు వేస్తారు, కటౌట్లు కడతారు, పాలాభిషేకాలు, కొబ్బరికాయలు కొట్టడం అన్నీ తెలిసిందే. కానీ, తిరుపతిలో ప్రతాప్ థియేటర్ వద్ద మాత్రం.. మేకపోతును బలిచ్చారు. జై బాలయ్య అంటూ నినాదాలు చేస్తూ మేకపోతును బలిచ్చి దాని తలతో బాలయ్యకు దిష్టి తీశారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
#VeeraSimhaReddy celebrations at Vijayawada Annapurna theater pic.twitter.com/DmrHbb3q1O
— Crush Every 1 (@avinashNBK) January 12, 2023
గుడులు, జాతర్లలో ఇలాంటి జంతు బలులు చూస్తుంటాం. అలాంటిది థియేటర్ వద్ద అభిమానులు మేకపోతును బలివ్వడంతో చాలామంది ఆశ్చర్యపోతున్నారు. మరోవైపు అభిమాన హీరోల సినిమాలకు ఇలాంటి బలులు కామన్ అనే చెబుతున్నారు. ఒంగోలు, నెల్లూరు, కర్నూలు వంటి ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉంటాయని చెబుతున్నారు. సాధారణంగా అమ్మవార్లకు జంతు బలి ఇస్తేనే జంతుప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. మరి హీరో కోసం మేకపోతును బలివ్వడంపై ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.
#BlockBusterVeeraSimhaReddy 💥💥💥💥
Celebrations At #Tirupati Pratap Theatre 📍#VeeraSimhaReddy #VeeraSimhaReddyfdfs #VeeraSimhaReddyMassJathara #VeeraSimhaReddyEuphoria #GodOfMassesNBK #NandamuriBalaKrishna pic.twitter.com/XxV67dxJE8— Bhagyesh NTR (@BhagyeshNTR6) January 12, 2023
ఇంక సినిమా విషయానికి వస్తే.. ట్రైలర్, సాంగ్స్ తో సినిమాకి మంచి క్రేజ్, హైఎక్స్ పెక్టేషన్స్ వచ్చాయి. అయితే సినిమాకి మాత్రం మిక్స్డ్ టాక్ వచ్చింది. బాలయ్యకు ఇచ్చిన ఎలివేషన్స్ మాత్రం ఫ్యాన్స్ కు పూనకాలు రావడం ఖాయమే. అభిమానులకు వీర సింహారెడ్డి సినిమా విజువల్ ఫీస్ట్ అనే చెప్పాలి. తమన్ సాంగ్స్, బీజీఎం నెక్ట్స్ లెవల్ అని ఇప్పటికే టాక్ వచ్చింది. బాలయ్య తర్వాత వరలక్ష్మి లేడీ విలన్ గా యాక్టింగ్ ఇరదీసేసిందని సంబరాలు చేసుకుంటున్నారు.
Before #NaatuNaatu #RRRMovie Fanshow At @SV_CinePlex #Tirupati
Now #VeeraSimhaReddy Fanshow At Pratap Theatre#BlockBusterVeeraSimhaReddy #VeeraSimhaReddyOnJan12th #VeeraSimhaReddyEuphoria #VeeraSimhaReddyfdfs #NandamuriBalaKrishna #GodOfMassesNBK pic.twitter.com/Nf4uNu53a4
— Bhagyesh NTR (@BhagyeshNTR6) January 12, 2023