సిరివెన్నెల మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. సినీ నటుడు ప్రకాశ్ రాజ్, సంగీత దర్శకుడు తమన్, డైరెక్టర్ అనిల్ రావిపూడి సంతాపం తెలిపారు. సిరివెన్నెల మృతిపట్ల కళాతపస్వి విశ్వనాథ్ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానని దర్శకుడు కె.విశ్వనాథ్ తెలిపారు. సిరివెన్నెల మృతిపట్ల నందమూరి బాలకృష్ణ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు.
“తెలుగు పాటని తన సాహిత్యంతో ప్రపంచ నలుమూలకు వ్యాపింపజేసిన ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఆయన నాకు ఎంతో ఆప్తులు. నేను నటించిన చిత్రాలకు వారు అద్భుతమైన పాటలు రాశారు. సినిమా పాటకు సాహిత్య గౌరవాన్ని కలిగించిన వ్యక్తి సిరివెన్నెల. ఆయన ఈ రోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నా. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని నందమూరి బాలకృష్ణ తెలిపారు.