ఆమె కన్నడలో ప్రముఖ హీరోయిన్. గతేడాది తమిళంలో అడుగుపెట్టింది. తాజాగా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు బీచ్ పిక్స్ లో సోషల్ మీడియాను షేక్ చేసి పడేస్తోంది.
టాలీవుడ్ లో ప్రతి ఏడాది కొత్త హీరోయిన్లు వస్తూనే ఉంటారు. అలా రీసెంట్ గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన కన్నడ భామ ఆషికా రంగనాథ్. ‘అమిగోస్’ మూవీ చూసిన వాళ్లకైతే సినిమా కంటే ఈ బ్యూటీనే తెగ నచ్చేస్తుంది. ఎందుకంటే అంత బాగుంది మరి. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు తనకు దొరికిన ఫ్రీ టైమ్ లో ఎంజాయ్ చేస్తూ ఫుల్ చిల్ అవుతోంది. తాజాగా మాల్దీవులు టూర్ వేసిన ఈ బ్యూటీ.. అందాల జాతరతో సోషల్ మీడియాలో రచ్చ లేపేస్తోంది. పొట్టిబట్టలు వేసుకుని నెటిజన్స్ ని అస్సలు కుదురుగా కూర్చోనివ్వకుండా చేస్తోంది.
ఇకవిషయానికొస్తే.. కర్ణాటకలో పుట్టి పెరిగిన ఆషికా రంగనాథ్, 2016లో వచ్చిన ‘క్రేజీబాయ్’ మూవీతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. హీరోయిన్ గా తొలి మూవీతోనే మంచి మార్కులు కొట్టేసింది. తాజాగా తెలుగులో ‘అమిగోస్’ సినిమాలో అందాల జాతర చేసింది. ‘ఎన్నో రాత్రులు వస్తాయి గానీ’ పాటలో ఈమె యాక్టింగ్, ఎక్స్ ప్రెషన్స్ కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇక సినిమా పూర్తయిన తర్వాత వేరే సినిమా షూటింగ్స్ నుంచి కాస్త బ్రేక్ తీసుకున్నట్లు ఉంది. ఇంకెందుకు లేటు చలో మాల్దీవులు అన్నట్లు టూర్ వేసేసింది.
ఇక టూర్ వెళ్లిన ఆషికా ఊరికే ఉంటుందా.. బీచ్ వయ్యారాలు ఒలకబోస్తూ మత్తెక్కించే పోజుల్లో కనువిందు చేసింది. ‘అమిగోస్’ సినిమాలో చూపించిన అందాలు సరిపోవు అన్నట్టుగా ఇక్కడ తన గ్లామర్ డోస్ ని మరింత పెంచింది. బికినీ ధరించకపోయినా పొట్టి డ్రెస్సులతో, మత్తెకించే చూపులతో కట్టిపడేసింది. హాట్ హాట్ ఫొటోలతో హీట్ పెంచేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి ఆషికా ఫొటోలు చూడగానే మీకేం అనిపించింది. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.