రాంగోపాల్ వర్మ.. ఈపేరు చెప్పగానే డైరెక్టర్ అనే పదం కంటే ముందు కాంట్రవర్సీ పర్సన్ అని గుర్తొస్తుంది. శివ, క్షణక్షణం, గోవింద గోవిందా తదితర అద్భుతమైన సినిమాలు తీసిన ఆయన.. ప్రస్తుతం కూడా సినిమాలు తీస్తున్నాడు. కానీ హిట్స్ మాత్రం కొట్టలేకపోతున్నాడు. ఇదంతా పక్కనబెడితే ఒకప్పుడు సినిమాలతో సావాసం చేసిన వర్మ.. ఇప్పుడు మాత్రం బ్యూటీస్ తో ఉంటున్నాడు.ఇక వివరాల్లోకి వెళ్తే.. ఆర్జీవీ ఈ మధ్య కాలంలో తీసిన సినిమాలు చూస్తే మీకో విషయం అర్ధమవుతోంది.
హాట్ హాట్ బ్యూటీస్ తో మాత్రమే చిత్రాలు తీస్తూ, వాళ్లతో మంచి బాండింగ్ మెంటైన్ చేస్తున్నాడు. వారిలో మెయిన్ గా చెప్పుకోవాల్సింది అప్సర రాణి గురించి. ఒడిశాకు చెందిన ఈమె.. హీరోయిన్ గా రెండు మూడు సినిమాలు చేసింది. కానీ ఏమంత పేరు తెచ్చుకోలేకపోయింది. ఎప్పుడైతే ఆర్జీవీ చేతిలో పడిందో ఆమె ఫేటే మారిపోయింది. వరసపెట్టి సినిమాలు చేసింది.
ఆర్జీవీ దర్శకత్వంలో థ్రిల్లర్, డేంజరస్ సినిమాల్లో అప్సరరాణి నటించింది. ఇందులో వచ్చిన ఫేమ్ ఆధారంగా క్రాక్, సీటీమార్ చిత్రాల్లో ప్రత్యేక గీతాలు చేసింది. ఇప్పుడు ఈమె పూల్ లో స్విమ్ చేస్తున్న ఓ వీడియోనే ఆర్జీవీ ట్వీట్ చేశాడు. ‘ఇంత హాట్ నెస్ ఉంటే స్విమ్మింగ్ పూల్ లో నీళ్లు ఆవిరి కాకుండా ఎలా ఉన్నాయో తెలియడం లేదు’ అని వర్మ తనదైన స్టైల్లో క్యాప్షన్ కూడా పెట్టడం విశేషం. దీంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది. ఆర్జీవీ ట్వీట్ చేసిన అప్సర వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
Heyyyyy how come the water didn’t evaporate with this kind of hotness ??? https://t.co/ZV9qc1IgZx
— Ram Gopal Varma (@RGVzoomin) September 17, 2022
ఇదీ చదవండి: RGVతో డాన్స్ చేశానని నా కుటుంబం నన్ను ద్వేషిస్తోంది: ఇనయ సుల్తానా