టాలీవుడ్ ప్రస్తుత జనరేషన్ లో హీరోయిన్ అనే పదానికి ఆమె సరికొత్త డెఫినిషన్ చెప్పింది. స్టిల్ ఇప్పటికీ హీరోయిన్ గా చేస్తూనే ఉంది. ఆమె ఎవరో కనిపెట్టారా?
ఆమె ఓ హీరోయిన్. అందం అద్భుతం. క్యూట్ నెస్ అమోఘం. ఓ సాధారణ నటిగా టాలీవుడ్ లోకి వచ్చింది. క్రేజ్ మాత్రం నెక్స్ట్ లెవల్లో అందుకుంది. హీరోయిన్ గా చేసిన సినిమాలు హిట్ కాకపోవచ్చు గానీ ఆమె మాత్రం తన యాక్టింగ్ తో ప్రతి ఒక్కరినీ ఇంప్రెస్ చేసింది. బికినీ దగ్గర నుంచి చీరకట్టు వరకు ఏదైనా సరే ఆమెకు సూట్ అయినంతగా మరో బ్యూటీకి సెట్ కావేమో అనిపిస్తుంది. అంత చూడముచ్చటగా ఉంటుంది మరి. పాన్ ఇండియా లెవల్ క్రేజ్ తెచ్చుకున్న ఈ భామ.. ఇప్పటికీ హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే ఉంది. మరి ఆమె ఎవరో గుర్తుపట్టారా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. పైన ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి అనుష్క శెట్టి. తన బ్రదర్ తో కలిసి నవ్వుతూ ఉంది. నాగార్జున ‘సూపర్’ మూవీతో నటిగా మారిన అనుష్క.. ‘స్టాలిన్’లో స్పెషల్ సాంగ్ కూడా చేసింది. అలా కెరీర్ ప్రారంభంలో చిన్న హీరోల దగ్గర నుంచి స్టార్స్ వరకు దాదాపు అందరితోనూ సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. ‘అరుంధతి’తో స్టార్ హోదా దక్కించుకుంది. ఆ తర్వాత నుంచి ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇప్పటివరకు 47 సినిమాలు చేసిన అనుష్క.. ప్రస్తుతం యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో ఓ మూవీ చేస్తోంది.
డార్లింగ్ ప్రభాస్ తో ‘బిల్లా’, ‘మిర్చి’ చేసిన అనుష్క.. ‘బాహుబలి’ రెండు భాగాల్లోనూ అతడికి జోడీగా నటించింది. వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా ఉండేసరికి అందరూ సమ్ థింగ్ సమ్ థింగ్ అనుకున్నారు. తామిద్దరం ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పిన వీళ్లు.. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉండిపోయారు. అయితే ‘సైజ్ జీరో’ చిత్రం కోసం అనుష్క బాగా లావు పెరిగిపోయింది. అది ఇప్పటికీ ఆమెని ఇబ్బంది పెడుతూనే ఉంది. రీసెంట్ గా ఆమె బొద్దుగా ఉన్న కొన్ని పిక్స్ కూడా వైరల్ అయ్యాయి. మరోవైపు ఆమె చిన్నప్పటి ఫొటో కూడా ఒకటి వైరల్ గా మారింది. దీంతో అనుష్క ట్రెండింగ్ లోకి వచ్చేసింది. మరి స్వీటీ అనుష్కని చిన్నప్పటి ఫొటోలో చూసి ఎంతమంది గుర్తుపట్టారు. కింద కామెంట్ చేయండి.