తెలుగు ఇండస్ట్రీలో హ్యాపీడేస్ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ తర్వాత వరుస విజయాలు అందుకుంటూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాది నిఖిల్ ‘కార్తికేయ 2’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘కార్తికేయ 2’ మూవీ టాలీవుడ్, బాలీవుడ్ లో కలెక్షన్ల వర్షం కురిపించింది. నిఖిల్ కి జోడీగా ఈ మూవీలో యంగ్ బ్యూటీ అనుపమ నటించింది. సుకుమార్ శిశ్యుడు అయిన సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకత్వంలో నిఖిల్, అనుపమ జంటగా నటించిన మూవీ ‘18 పేజెస్’తో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు నిఖిల్. డిసెంబర్ 23 న రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో ఈ చిత్రానికి పాజిటీవ్ టాక్ వచ్చింది. దీంతో ఈ చిత్ర యూనిట్ సక్సెస్ సెలబ్రెషేన్స్ చేసుకున్నారు.
నిఖిల్, అనుపమ జంటగా నటించిన ‘18 పేజెస్’మూవీ హిట్ టాక్ తెచ్చుకోవడంతో చిత్ర యూనిట్ పట్టరాని ఆనందంలో మునిగిపోయారు. అనుపమ, నిఖిల్ తో పాటు చిత్ర యూనిట్ కి కంగ్రాట్స్ తెలుపుతున్నారు అభిమానులు. తాజాగా ఈ మూవీ సక్సెస్ ని చిత్ర యూనిట్ గ్రాండ్ గా సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ పార్టీలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చిత్రంలోని ‘టైం ఇవ్వు పిల్ల.. కొంచెం టైం ఇవ్వు’ అంటూ సాగే పాటకు యంగ్ బ్యూటీ అనుపమతో కలిసి స్టెప్పులేశారు. వీళ్లతో పాటు డైరెక్టర్ సుకుమార్ కూడా స్టెప్పులు వేశారు. వీరు ముగ్గురు కలిసి నవ్వులు చిందిస్తూ.. డ్యాన్స్ చేస్తుండగా హీరో నిఖిల్ సెల్ఫీ వీడియో తీశాడు. ఈ వీడియో నిఖిల్ తన ఇన్ స్ట్రాగామ్ లో షేర్ చేయగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
‘18 పేజెస్’ మూవీకి ప్రముఖ స్టార్ డైరెక్టర్ సుకుమార్ కథ అందించగా ఆయన శిష్యుడు సూర్యప్రతాప్ పల్నాటి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. బన్నీ వాసు నిర్మించగా.. స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పించారు. ఇటీవల ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేక అతిథిగా విచ్చేసిన విషయం తెలిసిందే. మొదటి నుంచి హీరో నిఖిల్ కథల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వరుస హిట్స్ తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.