ఈ పాప ఇప్పుడు స్టార్ హీరోయిన్. ఓవైపు క్యూట్ నెస్.. మరోవైపు సూపర్ హాట్ అనేంత అందంగా ఉంటుంది. మరి ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా?
ఆ పాపని చూస్తే ఎవరికైనా సరే బుగ్గపై ముద్దుపెట్టేయాలనిపిస్తుంది. ఎందుకంటే అంత అమాయకం, క్యూట్ గా ఉంటుంది మరి. పెద్దయిన తర్వాత ఆ క్యూట్ నెస్ తగ్గిందా అంటే అస్సలు లేదు. చెప్పాలంటే ఇంకా అందంతో పాటు హాట్ నెస్ కూడా బాగా పెరిగిపోయింది. ఆ భామని చూసి మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడం అయితే చాలా కష్టం. అంతలా పిచ్చెక్కిస్తుంది. మరీ ముఖ్యంగా ఆమె పెద్దయ్యాక కూడా ఆమె బుగ్గలు, మరీ ముఖ్యంగా ఆ నవ్వు చూసి అలా మెల్ట్ అయిపోవచ్చు. అంతలా కేక పుట్టించే ఆ భామ ఎవరో కనిపెట్టారా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఇక లేటు చేయకుండా చెప్పేస్తున్నా. పైన ఫొటోలో కనిపిస్తున్న పాప హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. ఈరోజే ఆమె పుట్టినరోజు కూడా. కో ఇన్సిడెన్సో ఏమో తెలియదు గానీ అనుపమకు చాలామంది పుట్టినరోజు విషెస్ చెబుతున్నారు. మరోవైపు ఆమె చిన్నప్పటి ఫొటోలు కొన్ని వైరల్ గా మారింది. స్కూల్ డ్రస్ లో అమాయకంగా ఉన్న ఫొటో మాత్రం ఫ్యాన్స్, నెటిజన్స్ ని బాగా ఎట్రాక్ట్ చేసింది. ఇందులో భాగంగా ముందు వరసలో అబ్బాయిలందరూ ఉంటే ఆ లైన్లో ఉన్న అమ్మాయి అనుపమ మాత్రమే. బహుశా చిన్నప్పటి నుంచి ఆమెకు అంత ఫాలోయింగ్ ఉందేమో మరి.
ఇక ఆమె కెరీర్ విషయానికొస్తే.. గత నాలుగైదు నెలల్లో అనుపమ హీరోయిన్ గా చేసిన మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. అందులో ‘కార్తికేయ 2′, పాన్ ఇండియా వైడ్ హిట్ కొట్టగా.. ’18 పేజెస్’ మిక్స్ డ్ టాక్ అందుకుంది. ఇక ఓటీటీలో రిలీజైన ‘బటర్ ఫ్లై’ అయితే ఓకే అనిపించింది. ప్రస్తుతం అనుపమ.. ‘డీజే టిల్లు’ సీక్వెల్ లో హీరోయిన్ గా చేస్తోంది. ఆమె పుట్టినరోజు సందర్భంగా యమ హాట్ గా ఉన్న పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. కెరీర్ పరంగా డౌన్ అయింది అనుకున్న టైంలో అనుపమ హిట్స్ కొట్టడం, ఇన్ స్టాలోనూ హాట్ హాట్ ఫొటోలతో తన క్రేజ్ ని పెంచుకుంటూ పోతోంది. సరే ఇదంతా పక్కనబెడితే.. అనుపమ చిన్నప్పటి ఫొటోని మీలో ఎంతమంది గుర్తుపట్టారు? కింద కామెంట్ చేయండి.