తెలుగు చిత్ర ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం పుష్ప. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యర్నేని, రవి శంకర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రష్మికా మండన్న హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ మూవీ నుంచి పాటలు, టీజర్ లు ఒక్కొక్కటిగా రివీల్ చేస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు మూవీ యూనిట్.
తాజాగా విడుదలైన అమ్మీ అమ్మీ అంటూ సాగే ఈ పాట యూ ట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అయితే తాజాగా ఈ మూవీ నుంచి మరో సర్ ప్రైజ్ అనౌన్స్ మెంట్ కు మూవీ యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీపావళి కానుకగా పుష్ప నుంచి మరో టీజర్ ను వదిలేందుకు సినిమా యూనిట్ ప్రయత్నాలు చేస్తున్నారట. ఇక ఈ సినిమాలో నటిస్తున్న మరికొంత మంది పాత్రలను కూడా ఈ టీజర్ తో పరిచయం చేయనున్నారట. అయితే దీపావళికి విడుదల చేయనున్న ఈ టీజర్ ఎలా ఉండబోతుందోనని బన్నీ ఫ్యాన్స్ తెగ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.