తెలుగు నటి, టీవీ యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. టీవీ యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టిన అనసూయ.. ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీ అవుతోంది. అయితే.. అనసూయ సోషల్ మీడియా ఫాలోయింగ్ గురించి తెలిసిందే. అనసూయ ఎప్పుడెప్పుడు కొత్త పోస్ట్ పెడుతుందా.. అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటారు.
అనసూయ టీవీ ప్రోగ్రామ్స్, సినిమాలే కాదు.. తన అందాన్ని ఉపయోగించి అప్పుడప్పుడు స్పెషల్ సాంగ్స్ లో కాలు కదుపుతూ యువతను ఆకట్టుకుంటుంది. గ్లామర్ విషయంలో అనసూయ లక్షల ఫాలోయర్లను సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో అనసూయ పోస్టులు చేసే రచ్చ మాములుగా ఉండదు. అనసూయ కొత్తగా ఏ ఫోటోషూట్స్ చేసినా కుర్రకారు ఫుల్ హ్యాపీ అయిపోతారు.
సోషల్ మీడియా వాడకం అనేది అనసూయకు కొట్టినపిండి. అందుకే ఎప్పటికప్పుడు కొత్త కొత్త గ్లామరస్ పోస్టులతో ఫ్యాన్స్ ని ఫిదా చేస్తోంది. తాజాగా అనసూయ పోస్ట్ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఓల్డ్ హిందీ పాటకు అనసూయ సారీలో చేసిన రీల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. గులాబీ సారీలో అనసూయ అందాలకు నెటిజన్లు కళ్లప్పగిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవలే అనసూయ ఖిలాడి సినిమాలో గ్లామరస్ రోల్ చేసింది. త్వరలోనే పుష్ప 2, రంగమార్తాండా సినిమాలతో అలరించనుంది. మరి అనసూయ లేటెస్ట్ వీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.