టాలీవుడ్ గ్లామరస్ టీవీ యాంకర్ కం సినీ నటి అనసూయ భరద్వాజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. టీవీ యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన అనసూయ.. ప్రస్తుతం వరుస సినిమాలతో వెండితెర పై దూసుకుపోతుంది. ప్రస్తుతం రిలీజ్ కు రెడీగా ఉన్న పెద్ద సినిమాలన్నింటిలో అనసూయ ప్రధాన పాత్రలలో నటిస్తుంది. రంగస్థలంతో సూపర్ క్రేజ్ దక్కించుకున్న అనసూయ.. ఇటీవలే పుష్ప సినిమాతో మెప్పించింది.
తాజాగా మాస్ రాజా నటించిన ‘ఖిలాడి’ సినిమాలో కీలకపాత్ర పోషించింది. ఇటీవలే ఖిలాడి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న అనసూయ.. స్టేజి పైన యాంకర్ సుమని, స్టేజి కింద రవితేజని ఓ ఆటాడుకుంది. ఈ క్రమంలో సుమ.. అనసూయ ఇంకెప్పుడు స్పీచ్ ఇస్తావ్? నీ స్పీచ్ వాట్సాప్ లో పంపిస్తావా? అంది. వెంటనే అనసూయ స్టేజి వెళ్ళింది. ‘గుడ్ ఈవెనింగ్ చెప్పచ్చుగా వాళ్ళకి కూడా..’ అనగానే.. ‘అచ్చా’ అంటూ సెటైర్ వేసింది. అలాగే స్పీచ్ స్టార్టింగ్ లోనే రవితేజని చూసి.. ‘RT నవ్వుతున్నారేంట్రా..’ అనేసింది. ప్రస్తుతం అనసూయ స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి మీరు కూడా పూర్తీ వీడియో చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ చేయండి.