ఆ భామ స్టార్ హీరోయిన్. తెలుగుతో పాటు హిందీలోనూ పలు మూవీస్ చేసింది. అలాంటిది ఇప్పుడు ఏకంగా సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోయింది. ఆ పిక్ వైరల్ కావడంతో అందరూ ఆమె గురించే మాట్లాడుకుంటున్నారు.
హీరోయిన్ అనగానే చాలామందికి క్యూట్ ఫేస్ తో పద్ధతిగా ఉండే భామలే గుర్తొస్తారు. అందుకు తగ్గట్లే గ్లామర్ ని కాపాడుకోవడానికి సదరు బ్యూటీస్ కూడా చాలా కష్టపడుతుంటారు. ఇదంతా కాయిన్ కి ఓ వైపు మాత్రమే. చాలామందికి తెలియని మరో యాంగిల్ కూడా సదరు హీరోయిన్లలో ఉంటుంది. ఇందులో భాగంగానే చాలామంది భామలు డ్రింక్ చేస్తుంటారు. అప్పుడప్పుడు స్మోక్ కూడా చేస్తుంటారు. ఇదేం తప్పు అని చెప్పాం కానీ మీడియా కంట పడితేనే అసలు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు కూడా కోట్లాదిమంది ఫ్యాన్స్ ఉన్న ఓ హీరోయిన్.. సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోయింది. అందుకు సంబంధించిన ఫొటో ఇప్పుడు వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. బాలీవుడ్ లో చాలామంది హీరోయిన్స్ కి యాక్టింగ్ సరిగా రాదనే విషయం తెలిసిందే. ఈ విషయం హిందీ సినిమాలు చూసే ఎవరిని అడిగినా సరే ఇట్టే చెప్పేస్తారు. అలా వారిలో నటనకు సంబంధించిన టాలెంట్ లేకపోయినప్పటికీ మిగతావి మాత్రం కాస్త ఎక్కువగానే ఉంటాయి. అప్పట్లో డ్రగ్స్ కూడా తీసుకున్నారని కొందరిపై ఆరోపణలు వచ్చాయి. ఆ వీడియో కూడా బయటకొచ్చింది. అదంతా పక్కనబెడితే తాజాగా హీరోయిన్ అనన్య పాండే సిగరెట్ తాగుతూ దొరికిపోయింది. కజిన్ అలన్నా పాండే పెళ్లి వేడుకలో భాగంగా అందరూ సెలబ్రేట్ చేసుకుంటుంటే.. ఈమె మాత్రం ఓ సైడ్ కు నిల్చుని స్మోక్ చేస్తూ కనిపించింది. ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది.
నటుడు చుంకీ పాండే కూతురిగా ఇండస్ట్రీలోకి వచ్చిన అనన్య.. ఇప్పటివరకు ఐదు సినిమాలు మాత్రమే చేసింది. వాటిలో ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ కొట్టలేకపోయింది. అయితే ఏదో అలా గ్లామర్ తో నెట్టుకొచ్చేస్తున్న అనన్య.. ‘లైగర్’తో తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చింది కానీ ఘోరంగా ఫెయిలైంది. ఇప్పుడు ఆమెనే సిగరెట్ తాగుతూ కనిపించేసరికి చాలామంది నెటిజన్స్.. ఈమెని తెగ ట్రోల్ చేస్తున్నారు. అనన్య పెదాల బ్యూటీ సీక్రెట్ ఇదేనా అని కామెంట్ చేస్తున్నారు. మరికొందరైతే.. ఈ బాలీవుడ్ హీరోయిన్లకు బుర్రలేదని కూడా అనేస్తున్నారు. మరి అనన్య స్మోకింగ్ చేస్తూ దొరికిపోవడంపై మీరేం అంటారు. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.