వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా, తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహన్ హీరోయిన్స్ గా ఆలీ, సునీల్, రాజేంద్రప్రసాద్ ముఖ్యపాత్రల్లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో F3 తెరకెక్కిన సంగతి తెలిసిందే. మే 27న రిలీజ్ అయిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకోవడమేకాక.. పాజిటివ్ టాక్ తో సక్సెస్ఫుల్గా థియేటర్లలో రాణిస్తుంది. సినిమా రిలీజ్ అయిన 5 రోజుల్లోనే 70 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. సినిమా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న సందర్భంగా సోమవారం (మే 30) సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. హిట్ అయిన సినిమా గురించి కావాలని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆలీ మండి పడ్డారు.
తమకు సినిమా తప్ప వేరే ఏది చేత కాదన్నారు ఆలీ. అంతేకాక తమకు మరే ఇతర వ్యాపారాలు లేవన్నారు. ఓ సినిమా హిట్ అయితే…ఓ నిర్మాత బావుంటాడు.. నిర్మాత బావుంటే ఓ దర్శకుడు బావుంటాడు. .. ఆర్టిస్టులు అంతా బావుంటారు… టెక్నీషీయన్లు అంతా బావుంటారు అన్నారు ఆలీ. కాకపోతే.. కొంతమంది హిట్ అయిన సినిమా బాగోలేదని… కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండి పడ్డారు. అలా నెగిటివ్ ప్రచారం చేసే వాళ్లు కూడా ఉండేది ఈ ఇండస్ట్రీలోనే అని.. వారికి కూడా ఇది తప్ప వేరే ఏదీ చేతకాదన్నారు. ఓ సినిమా బావుందంటే.. ఆ డైరెక్టర్ సంతోషిస్తాడు.. ఆ యూనిట్ కూడా హ్యాపీ అవుతుందన్నారు. ఇండస్ట్రీని నమ్ముకుని వేలాది మంది ఉన్నారని.. తప్పుడు ప్రచారంతో వారి పొట్టకొట్టొద్దని ఆలీ సూచించారు.
ఇది కూడా చదవండి: Anchor Manjusha: యాంకర్ పై రాజేంద్ర ప్రసాద్ సీరియస్.. దెబ్బకు స్టేజ్ దిగేసిన మంజూష!
అంతేకాక చెన్నైలో ఉండేటప్పుడు తాము ఎప్పుడు ఇలాంటి వార్తలు వినలేదన్నారు ఆలీ. ఈ మధ్యకాలంలోనే ఇలాంటివి ఎక్కువ అయ్యాయన్నారు. ఓ సినిమా పోతే మరో సినిమా వాళ్లు చంకలు గుద్దుకోవడం ఏంటో తనకు అర్థం కావడం లేదన్నారు ఆలీ. దయచేసి అలాంటివి మానేయండి అంటూ సూచించారు. మనకన్నా.. అవతాలివారు బాగుండాలి అనుకుంటే భగవంతుడు మిమ్మల్ని వాడికంటే బాగా ఉంచుతాడన్నారు.
ఇది కూడా చదవండి: Actor Pradeep: అచ్యుత్ నా చేతుల్లోనే చనిపోయాడు.. నేనే ప్రత్యక్ష సాక్షి: సీనియర్ యాక్టర్ ప్రదీప్
ఇక ఎఫ్3లో అనిల్ రావిపూడి తనకు మంచి పాత్ర ఇచ్చారన్నారు ఆలీ. తన చేతికి ఓ గన్ ఇచ్చి ఫుల్ కామెడీ చేయించారన్నారు. ఎక్కడకు వెళ్లినా ఆ గన్ గురించే అంతా అడుగుతున్నారన్నారు. ఎఫ్4 లో కూడా ఇంతకుమించిన కామెడీ ఉంటుందన్నారు. ఇక ఇటీవలే విడుదలైన ఎఫ్ 3 సినిమా 5 రోజుల్లోనే 70 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. మరో వారం రోజులు ఆగితే కానీ ఈ సినిమా ఫలితం ఏమిటనేది తెలియదు. ప్రస్తుతానికి కలెక్షన్స్ బాగానే రావడంతో అనిల్ రావిపూడి అండ్ ఎఫ్3 టీం సెలబ్రేషన్ మూడ్లో ఉన్నారు. అలీ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Tamanna: వీడియో: సుమ క్యాష్ షోలో మెరిసిన తమన్నా! చివర్లో ఊహించని షాక్!