బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా సోషల్ మీడియాలో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీలలో దేత్తడి హారిక ఒకరు. బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్న హారిక.. టాప్ 5 కంటెస్టెంట్ గా నిలిచి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. అలాగే హౌస్ లో ఉన్నంత కాలం తన అందాల ట్రీట్ తో ఫ్యాన్స్ కి కిక్కిచ్చింది. అయితే.. బిగ్ బాస్ నుండి బయటికి వచ్చాక సినిమాలలో బిజీ అవుతుందేమో అని అందరూ అనుకున్నారు. కానీ.. సినిమాలలో కాకుండా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటోంది ఈ భామ. ప్రస్తుతం తన బ్యాచిలర్ లైన్ ని ఎంజాయ్ చేస్తున్న హారిక.. రీసెంట్ గా గోవా టూర్ కి వెళ్లినట్లు తెలుస్తోంది.
సోషల్ మీడియాలో 15 లక్షలకు పైగా ఫాలోయర్స్ ని కలిగిన హారిక.. ఇన్ స్టాగ్రామ్ లో ఎంత రచ్చ చేస్తుందో అందరికి తెలిసిందే. అందుకే సినిమాలు లేకపోయినా సోషల్ మీడియాలో గ్లామరస్ పోస్టులు పెడుతూ ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తోంది. తాజాగా గోవా టూర్ కి వెళ్లిన ఈ అమ్మడు.. బీచ్ లో ఇదివరకు ఎన్నడూ చూడని రేంజ్ లో హాట్ షో చేసింది. చాలీచాలని స్కర్ట్ లో థైస్ కనిపించేలా పోజులు పెట్టి.. నెట్టింట సెగలు రేపింది. ప్రస్తుతం హారిక బీచ్ లో దిగిన పిక్స్ తెగవైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోషూట్ తో మరోసారి ఫ్యాన్స్ కి గ్లామర్ ట్రీట్ ఇవ్వడంలో తనకు పోటీ ఎవరు లేరని ప్రూవ్ చేసింది.
ఇదిలా ఉండగా.. హారిక థండర్ థైస్ చూస్తూ అభిమానులతో పాటు నెటిజన్స్ కూడా నేత్రానందాన్ని కామెంట్స్ లో తెలియజేస్తున్నారు. హారిక అందాలకు తాము బేజార్ అయిపోతున్నామని కొందరు కామెంట్ చేయగా.. మరికొందరు ఇలా అయితే తట్టుకోవడం కష్టమే అంటూ కంప్లిమెంట్స్ ఇస్తున్నారు. చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్, టిక్ టాక్ వీడియోస్ ద్వారా పాపులర్ అయిన హారిక.. బిగ్ బాస్ లో అడుగు పెట్టాక ఊహించని క్రేజ్ అందుకుంది. ఇప్పటికైతే సోషల్ మీడియా పోస్టులతో ఆకట్టుకుంటున్న ఈ భామ.. త్వరలో సినిమాలలో బిజీ అవుతుందేమో చూడాలి. మరోవైపు గోవాకి స్పెషల్ పర్సన్ తో వెళ్లినట్లు స్టేటస్ లో తెలిపింది. చూడాలి మరి ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేస్తుందేమో!